Site icon NTV Telugu

PM Modi: ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లిన మోడీ.. 4 రోజులు టూర్

Modi

Modi

ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో మోడీ పర్యటించనున్నారు. ఇక 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఫ్రాన్స్‌లో ఏఐ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు ఏఐ సమ్మిట్‌కు మోడీ అధ్యక్షత వహిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 12న ఫ్రాన్స్.. వీవీఐపీ విందు ఇవ్వనుంది. ఈ విందులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. అంతేకాకుండా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కూడా భేటీ అయి ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా థర్మో న్యూక్లియర్‌ యాక్టర్‌ను కూడా మోడీ సందర్శించనున్నారు.

ఇది కూడా చదవండి: Punjab: పంజాబ్‌ పాటియాలాలో పట్టుబడిన రాకెట్ మందుగుండు సామాగ్రి..

అనంతరం ఫ్రాన్స్ నుంచి మోడీ అమెరికా వెళ్లనున్నారు. 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. ఆయన్ను కలిసిన ప్రపంచ నాయకుల్లో అతి కొద్ది మందిలో మోడీ ఒకరు కావడం విశేషం. అంతేకాకుండా కొన్ని రోజులకే అమెరికా నుంచి మోడీకి ఆహ్వానం రావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: CISF Recruitment 2025: 10th పాసైతే చాలు.. సీఐఎస్ఎఫ్‌లో భారీగా కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ. 69 వేల జీతం

Exit mobile version