బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గర్ యోజన పథకాన్ని ప్రారంభించి 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తానూ.. నితీష్ కుమార్ బీహార్ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాలు మహిళలను పట్టించుకోలేదని.. ఎన్డీఏ మాత్రం ఆర్థికంగా బలపడేందుకు కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: India: పాక్ ప్రోత్సాహంతోనే భారత్‌లో ఉగ్ర దాడులు.. యూఎన్‌లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్
అయితే ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎన్డీఏ కూటమి మహిళల ఖాతాల్లో డబ్బులు వేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ఇదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేసి విజయవంతం అయింది. ఇప్పుడు బీహార్‌లో కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తోందని భావిస్తున్నారు. ప్రత్యర్థులపై ఆధిక్యం పొందేందుకు బీజేపీ సహా అనేక పార్టీలు ఇదే వ్యూహాన్ని అమలు చేశాయి. తాజాగా అదే వ్యూహాన్ని బీహార్‌లో కూడా బీజేపీ అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Khwaja Asif: అమెరికాతో సంబంధాలున్నా.. చైనానే అగ్ర మిత్రదేశం.. పాక్ రక్షణమంత్రి కీలక ప్రకటన
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ‘‘లాడ్లీ బహన్ యోజన’’, మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘‘లడ్కీ బహిన్ యోజన’’ పథకాలు రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టాయి. తాజాగా బీహార్‌లో ప్రవేశపెట్టిన పథకం మరోసారి అధికారం కట్టబెట్టడానికి గేమ్-ఛేంజర్‌గా ఉంటుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో బీజేపీ ప్రభుత్వాలు వరుసగా నెలకు రూ.1,250, రూ.1,500 ఇచ్చాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ ఎన్నికల సంవత్సరాల్లో ఈ పథకాలను ప్రారంభించాయి. ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో కూడా మహిళలకు ఇలాంటి నగదు బదిలీ పథకాలను బీజేపీ హామీ ఇచ్చింది. ఇక హర్యానా, ఢిల్లీలో ఇలాంటి పథకాలే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ హామీలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. కర్ణాటకలో కాంగ్రెస్, జార్ఖండ్‌లో జేఎంఎం, తెలంగాణలో కాంగ్రెస్ ఇలాంటి హామీలు ఇవ్వడంతోనే ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని బీహార్‌లో కూడా బీజేపీ అమలు చేసి లబ్ధి పొందాలని భావిస్తోంది.
త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్-నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా త్వరలో బీహార్‌కు వందే భారత్ స్లీపర్ రైలును కూడా మోడీ ప్రారంభించబోతున్నారు. మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
