PM Modi: సైనిక సంఘర్షణతో సమస్య పరిష్కారం కాదు.. యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు

  • సైనిక సంఘర్షణతో సమస్య పరిష్కారం కాదు
  • భారత్ శాంతిని కోరుకుంటోంది
  • మధ్యప్రాచ్య యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు
Modi

Modi

సైనిక సంఘర్షణతో సమస్యకు పరిష్కారం దొరకదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా యుద్ధం, ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ శాంతిని కోరుకుంటోందని.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఏదైనా సంఘర్షణను పరిష్కరించడానికి చట్ట పాలన, సంభాషణ, దౌత్యం అనే మూడు అంశాలు అవసరమని తేల్చి చెప్పారు. పెరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య నెలకొన్న సమస్యకు సైనిక ఘర్షణే పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Nitish kumar: రాజ్యసభకు నితీష్ కుమార్ నామినేషన్.. హాజరైన అమిత్ షా

‘‘భారతదేశం-ఫిన్లాండ్ రెండూ చట్ట పాలన, సంభాషణ, దౌత్యాన్ని నమ్ముతాయి. సైనిక వివాదం ద్వారా మాత్రమే ఏ సమస్యనూ పరిష్కరించలేమని మేము అంగీకరిస్తున్నాం. అది ఉక్రెయిన్ అయినా లేదా పశ్చిమాసియా అయినా.. వివాదాలను త్వరగా ముగించడానికి, శాంతి కోసం ప్రతి ప్రయత్నానికి మేము మద్దతు ఇస్తూనే ఉంటాము. ప్రపంచంలో పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ సంస్థలను సంస్కరించడం అవసరం మాత్రమే కాదు.. అత్యవసరం కూడా అని మేము అంగీకరిస్తున్నాము. అన్ని రకాల ఉగ్రవాద నిర్మూలన మా ఉమ్మడి నిబద్ధత.’’ అని మోడీ అన్నారు.