PM Modi: తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ.. ఫొటోలు వైరల్
- తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ
- కూలీలతో ముచ్చటిస్తూ ఆకులు కోసిన ప్రధాని
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ సామాన్యుడిలా మారిపోయారు. భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి మరీ తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
- Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
- El Nino Effect On Stock Market: ఎల్‌నినో ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
అస్సాంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల పోరు జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ జరుగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోడీ అస్సాం పర్యటనకు వచ్చారు. బుధవారం ఉదయం దిబ్రూగఢ్‌లోని తేయాకు తోటలకు వెళ్లారు. అక్కడ పని చేస్తున్న మహిళా కూలీలతో కలిసి తేయాకు ఆకులు కోశారు. వారితో ముచ్చటిస్తూ పని చేస్తూ కనిపించారు. అలాగే వారి సంస్కృతిని తెలుసుకుని సెల్ఫీ తీసుకున్నారు. అయితే దేశ ప్రధాని తమతో కలిసి పని చేయడంతో మహిళా కూలీలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. తేయాకు అస్సాం ఆత్మ అని.. ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించుకుందని మోడీ రాసుకొచ్చారు. ‘‘ఈ ఉదయం దిబ్రుగఢ్‌లో నేను ఒక టీ తోటను సందర్శించి.. అక్కడ పనిచేస్తున్న మహిళలతో మాట్లాడాను. అది నాకు ఎంతో గుర్తుండిపోయే అనుభవం.’’ అని మోడీ పేర్కొన్నారు.

‘‘తేయాకు కోసిన తర్వాత మహిళలు నాతో వారి సంస్కృతి గురించి మాట్లాడుతూ.. సెల్ఫీ కూడా తీసుకున్నారు. తేయాకు తోటల కుటుంబాలందరి కృషికి మేము చాలా గర్వపడుతున్నాం. వారి కఠోర శ్రమ, అంకితభావం అస్సాం కీర్తిని మరింత పెంచాయి.’’ అని మోడీ రాసుకొచ్చారు.

ఏప్రిల్ 9వ తేదీన అస్సాంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది.







We are very proud of the efforts of each and every tea garden family. Their hardwork and perseverance have enhanced Assam’s pride.
Here are some more glimpses from a tea garden in Dibrugarh. pic.twitter.com/L7je3s8JnO
— Narendra Modi (@narendramodi) April 1, 2026
Tea is the soul of Assam! The tea from here has made its way across the world.
This morning in Dibrugarh, I went to a tea garden and interacted with women working here. It was a very memorable experience. pic.twitter.com/2VZufAAZ0h
— Narendra Modi (@narendramodi) April 1, 2026
తాజావార్తలు
-
Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్‌తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్‌సీ పెద్దాయన కథ ఇదే!
-
Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..
-
Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
-
Vaibhav Suryavanshi: వైభవ్‌కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
-
Vivo T5: వివో T5 మిడ్-రేంజ్ ఫోన్ విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6s Gen 2 చిప్
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!