PM Modi: ఇంటర్నెట్ను షేక్ చేస్తోన్న మోడీ ‘ఝల్మురి’ వీడియో
- ఇంటర్నెట్ను షేక్ చేస్తోన్న మోడీ ‘ఝల్మురి’ వీడియో
- ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కోట్లలో వ్యూస్
- ఆదివారం బెంగాల్లో ప్రచారం చేసిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఆదివారం పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్గ్రామ్లో ఒక స్నాక్ సెంటర్ దగ్గరకు వెళ్లారు. రుచికరమైన ఝల్మురి (మరమరాలు)ని ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
ప్రచారంలో భాగంగా ఆదివారం మోడీ కొంత సేపు విరామం తీసుకున్నారు. ఆ సమయంలో ఝల్మురి స్టాల్ దగ్గరకు వెళ్లి విక్రేతతో సరదాగా మాట్లాడుతూ.. ‘‘భాయ్.. హమే అప్నా ఝల్మురి ఖిలావో.’’ అని కోరారు. విక్రేత.. ‘‘మీరు ఉల్లిపాయలు తింటారా?’’ అని అడగగా.. మోడీ నవ్వుతూ.. ‘‘ప్యాజ్ ఖాతే హై, దిమాగ్ నహీ ఖాతే బస్” అని సరదాగా స్పందించారు. దీంతో అక్కడనున్న వారంతా నవ్వుకున్నారు. రూ.10 చెల్లించి ఝల్మురి తీసుకుని తీన్నారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
మోడీ పోస్ట్ చేసిన వీడియోను కేవలం 24 గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మంది వీక్షించగా… ఫేస్బుక్లో దాదాపు 9 కోట్ల వ్యూస్ సాధించింది. మోడీ తెలుపు కుర్తా, నీలం పిన్‌స్ట్రైప్ వెస్ట్‌కోట్, బీజేపీ లోటస్ గుర్తుతో ఎరుపు గామ్ఛా ధరించి కనిపించారు.
ఝల్మురి బెంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్పైసీ స్నాక్. మసాలా, ఉప్పు కారం, తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి తయారు చేస్తారు. రుచికరమైన ఝల్‌మురిని తిన్నానంటూ మోడీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఆ వీడియోను మరోసారి చూసేయండి.
In between four rallies across West Bengal on a packed Sunday, had some delicious Jhalmuri in Jhargram. pic.twitter.com/NEKLm5R0mE
— Narendra Modi (@narendramodi) April 19, 2026
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?