PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
- భారత్ వచ్చి, మాతో కలిసి పనిచేయండి..
- పెట్టుబడిదారులకు ప్రధాని మోడీ పిలుపు..
- ఫ్రాన్స్‌లో ‘ఇండియా ఇన్నోవేట్స్ 2026’ కార్యక్రమం..
- ఫ్రెంచ్ అధ్యక్షుడితో కలిసి పాల్గొన్న ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మోడీని ఘనంగా స్వాగతించారు. ఇద్దరు నేతలు ‘‘ఇండియా ఇన్నోవేట్స్ 2026’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ భారత సాంకేతిక అభివృద్ధి గురించి మాట్లాడారు. భారత్ కేవలం ఒక వినియోగదారు దేశం మాత్రమే కాదని, ప్రపంచంలో అతిపెద్ద సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. దశాబ్ధం క్రితం భారత్ కేవలం టెక్నాలజీని స్వీకరించే దేశంగా మాత్రమే ఉండేదని, కానీ నేడు సాంకేతికత అందించే దేశంగా ఆవిర్భవించిందని చెప్పారు. పెట్టుబడిదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్ వచ్చి, తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో రూపకల్పన చేయాలని, భారత్‌ను అభివృద్ధి చేయాలని, ప్రపంచం కోసం పరిష్కారాలు సృష్టించండి అని ఆహ్వానించారు.
‘ఇండియా ఇన్నోవేట్స్ 2026’ అనేది దేశంలోని డీప్-టెక్ స్టార్టప్‌లు మరియు పరిశోధనా సంస్థలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక కార్యక్రమం. ఇదే సమావేశంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు మక్రాన్ మాట్లాడుతూ.. భారత్‌ను ఆవిష్కరణల దేశంగా అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), వాతావరణ మార్పు వంటి కీలక రంగాలలో భారత్, ఫ్రాన్స్‌లకు బలమైన భాగస్వామ్యం ఉందని చెప్పారు. భారతదేశ ‘మేక్ ఇన్ ఇండియా’ కు ఫ్రాన్స్ తోడుగా ఉంటుందని అన్నారు.
Also Read
Heureux de vous retrouver à Nice, mon ami le Président Macron. Je vous remercie d’avoir participé à « Bharat Innovates », alors que nos deux nations célèbrent « l’Année de l’innovation ».@EmmanuelMacron pic.twitter.com/yiud0gikcq
— Narendra Modi (@narendramodi) June 14, 2026
తాజావార్తలు
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!