Site icon NTV Telugu

PM Modi: ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటాం.. ట్రంప్‌ టారిఫ్‌లపై మోడీ ధ్వజం

Modi

Modi

ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటామని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సెమికాన్ 2025 సదస్సులో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. జూన్ త్రైమాసికంలో భారతదేశం బలమైన ఆర్థిక పనితీరును కనబరించిందని ప్రశంసించారు. ఆర్థిక స్వార్థం ద్వారా నడిచే సవాళ్లను దేశం ఎలా ఎదుర్కొందో ఇదే చక్కని ఉదాహరణ అన్నారు. భారత్‌ 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందన్నారు. ఇక భారతదేశంలో సెమీకండక్టర్ భవిష్యత్తును నిర్మించడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధంగా ఉందనే స్పష్టమైన సందేశాన్ని సెమికాన్ ఈవెంట్ పంపిందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్ అభిృద్ధి చెందుతోందని.. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేకిన్‌ ఇండియా కోసం భారత్‌కు రావాలని.. ప్రపంచం కోసం తయారీలు చేపట్టాలని మోడీ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Punjab: అత్యాచారం కేసులో అరెస్టైన ఆప్ ఎమ్మెల్యే వీరంగం.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్

మేడిన్‌ ఇండియా ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ప్రపంచ దేశాలు చెప్పుకొనే రోజు త్వరలోనే రానుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. సెమీకాన్‌ ఇండియా 2025 సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీ పెరిగినా భారత్‌కు ఆదరణ తగ్గలేదన్నారు.

ఇది కూడా చదవండి: US: మోడీ రష్యాతో కాదు.. అమెరికాతో ఉండాలి.. ట్రంప్ వాణిజ్య సలహాదారు నవారో వ్యాఖ్య

భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి రష్యా, చైనాతో భారత్ సంబంధాలు పెంచుకుంటోంది. ఇక చైనా వేదికగా జరిగిన ఎస్‌సీవో సమావేశంలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ నవ్వుకుంటూ కనిపించారు. ఈ దృశ్యాలు చాలా హైలెట్‌గా నిలిచాయి. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Exit mobile version