PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి
- ప్రజాస్వామ్యబద్ధంగానే చర్చిస్తాం!
- 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి
- 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించారు. దేశంలో భిన్న భాషలు, విస్తృత మీడియా వ్యవస్థ, సోషల్ మీడియా వినియోగం ప్రజాస్వామ్య చర్చలకు బలాన్నిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, అభిప్రాయాల వ్యక్తీకరణకు డిజిటల్ వేదికలు కీలకంగా మారాయని వివరించారు. భారత్‌లో వందలాది భాషలు మాట్లాడుతున్నారని, దేశవ్యాప్తంగా సుమారు 80 వేల రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ఇతర ప్రచురణలు ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియా విస్తరణతో ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి మరిన్ని అవకాశాలు లభించాయని చెప్పారు.
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో భారత్‌లో 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు వివిధ అంశాలపై చర్చించడానికి, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి డిజిటల్ వేదికలు సహాయపడుతున్నాయని వివరించారు. “మేం అంశాలపై ప్రజాస్వామ్యబద్ధంగా చర్చిస్తాం. డిజిటల్ శక్తి ప్రజలను అనుసంధానించడంతో పాటు వివిధ వేదికలపై చర్చలు జరపడానికి తోడ్పడింది” అని మోడీ అన్నారు.
Also Read
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
చౌకగా మొబైల్ డేటా
దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడం, మొబైల్ డేటా అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు కొత్త అవకాశాలు లభించాయని ప్రధాని చెప్పారు. 2014కు ముందు మొబైల్ ఫోన్ ఉన్నవారికే సమాచారం, జ్ఞానం, అవకాశాలు ఎక్కువగా అందుబాటులో ఉండేవని పేర్కొన్నారు. 2014 తర్వాత మొబైల్ డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ప్రస్తుతం చిన్న పట్టణాల్లోని విద్యార్థులు సైతం డిజిటల్ విద్యను అభ్యసించే అవకాశం పొందుతున్నారని చెప్పారు. కనెక్టివిటీ అనేది కేవలం ప్రజలను అనుసంధానించడమే కాదని వారికి అవకాశాలను కూడా చేరువ చేస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ఫోరమ్ ప్రధాన అంశమైన ‘ఎమర్జింగ్ పవర్స్’ గురించి ప్రస్తావిస్తూ.. 21వ శతాబ్దంలో శక్తికి సంబంధించిన నిర్వచనం మారుతోందని అన్నారు. టెక్నాలజీ, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ప్రపంచంలో కీలకమైన శక్తులుగా ఎదుగుతున్నాయని వివరించారు. శక్తి ఎవరి చేతుల్లో ఉందనేది మాత్రమే కాకుండా.. దానిని ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. సాంకేతికత లక్షలాది మంది జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడాలా? లేక కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చాలా? అనే అంశాన్ని సమాజం ఆలోచించాలని అన్నారు.
శక్తి అంటే ఇతరులను నియంత్రించడం కాదని, వారికి సాధికారత కల్పించడమేనని మోడీ అభిప్రాయపడ్డారు. సాంకేతికతతో ప్రజలకు కొత్త అవకాశాలు కల్పించడం, వారి సామర్థ్యాలను పెంపొందించడం ముఖ్యమని చెప్పారు. ఇతరులను శక్తిమంతం చేసే ఆలోచన భారత్‌కు కొత్తది కాదని పేర్కొన్నారు.. నియంత్రణ నుంచి సాధికారత వైపు, పోటీ నుంచి సహకారం వైపు ప్రపంచం అడుగులు వేయాలని మోడీ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!