Nitish Setu: బీహార్‌లో గంగానదిపై నిర్మించిన 9.76 కిలోమీటర్ల పొడవైన ఆరు వరసల ‘‘నితీష్ సేతు’’ను ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. వైశాలి జిల్లాలోని బిదుపూర్ బ్లాక్‌ను పాట్నా శివారులోని కచ్చీ దర్గాను ఈ వంతెల అనుసంధానిస్తుంది. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ పేరును ఈ వంతెనకు పెట్టారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
వంతెన ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ ముందుగా పాట్నా చేసుకున్నారు. విమానాశ్రయంలో నితీష్ కుమార్ ప్రధానికి ఘన స్వాగతం పలిచారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ప్రధాని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పాట్నా ఎయిర్‌పోర్టులో నితీష్ కుమార్ జీని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. మే నెల తర్వాత ప్రధాని బీహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
రూ. 34,470 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద ఇళ్లను పొందిన 26,900 మందికి పైగా లబ్ధిదారులకు గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే, వంతెనకు నితీష్ సేతు అని పేరుపెట్టడంపై ప్రతిపక్ష ఆర్జేడీ కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై విమర్శలు గుప్పించింది. నితీష్ కుమార్ కొంతకాలం ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ వంతెన విషయంలో తమకు కూడా క్రెడిట్ దక్కాలని ఆర్జేడీ భావిస్తోంది.
LIVE: Prime Minister Narendra Modi visits Nitish Setu in Vaishali district I Bihar
SOURCE : DD
#narendramodi #bjp #vaishali #bihar #nitishsetu #live https://t.co/JERJstFBTb
— ANI (@ANI) November 21, 2026

