PM Modi: ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన మోడీ
- ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన మోడీ
- గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేసిన ప్రధాని
- భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఉత్తర భారతదేశాన్ని కనెక్టివిటీ చేసే కీలకమైన మార్గాన్ని మోడీ జాతికి అంకితం చేశారు. అనంతరం సహారన్‌పూర్‌లో ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించారు. మోడీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
210 కిలోమీటర్ల పొడవైన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి కేవలం రెండున్నర నుంచి మూడు గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రకృతి పరిరక్షణకు, ఆధునిక ఇంజనీరింగ్‌కు గొప్ప ఉదాహరణగా నిలవనుంది. రాజాజీ టైగర్ నేషనల్ పార్క్ మీదుగా వెళ్లే ఆసియాలోనే అత్యంత పొడవైన 12 కిలోమీటర్ల గ్రీన్ ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్ ఉంది.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను కలుపుతుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించి డెహ్రాడూన్, మసూరీ, చార్ ధామ్ ధామ్‌లకు ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. ఇక ఎక్స్‌ప్రెస్ వేకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే, జాతీయ రహదారులు, 10కి పైగా రాష్ట్ర రహదారులతో ప్రత్యక్ష అనుసంధానాలు ఉన్నాయి.
ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యేకతలు ఇవే..
210 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
సుమారు రూ.11,970 కోట్ల వ్యయం
ఆసియాలోనే అతిపెద్ద హరిత ఎలివేటెడ్ కారిడార్, 12 కిలోమీటర్ల పొడవు
మార్గం పొడవునా సీసీటీవీ కెమెరాలు, సోలార్ లైట్లు, పచ్చదనం
డ్రోన్ల ఎగరవేతపై నిషేధం, ప్రతి దశలోనూ భద్రత
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?