NTV Telugu Site icon

PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi US Visit: 3 రోజుల అమెరికా పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం జూన్ 21న తెల్లవారుజామున 1.30 గంటలకు వాషింగ్టన్ లోని ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో దిగాల్సి ఉంది. అక్కడ భారతీయ అమెరికన్ బృందం ఆయనకు స్వాగతం పలుకుతుంది. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు ఒక మలుపుగా భావిస్తున్నారు. రక్షణ రంగంలో సహకారం, సాంకేతిక బదిలీకి సంబంధించి కీలక ఒప్పందాలు జరగనున్నాయి. 2019లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో ప్రధాని పర్యటనపై ప్రపంచ దేశాలు చాలా ఆసక్తి చూపిస్తున్నాయి.

Read Also: Himalayas: పొంచి ఉన్న ముప్పు.. 65 శాతం వేగంగా కరుగుతున్న హిమాలయ హిమానీనదాలు….

జూన్ 21 నుంచి 23 వరకు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో 180 దేశాల ప్రతినిధులతో పాల్గొననున్నారు. జూన్ 22న అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో మోడీ ప్రసంగిస్తారు. అదే రోజు ప్రెసిడెంట్ బైడెన్ దంపతులు వైట్ హౌజులో మోడీకి స్వాగతం పలకనున్నారు. బైడెన్ తో భేటీ కానున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, 5 కీలక రంగాల్లో పరస్పర సహకారం, రెండు దేశాల మధ్య వ్యాపార-వాణిజ్య బంధాల గురించ చర్చిస్తారు. ఇదే రోజు సాయంత్రం ప్రెసిడెంట్ జోబైడెన్ ఆయన సతీమణి, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ మోడీకి విందు ఇవ్వనున్నారు.

జూన్ 23న వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సంయుక్తంగా మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. వాషింగ్టన్ లో ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు, ప్రధాన కంపెనీలు ప్రతినిధులను, నిపుణులతో మోడీ సమావేశం కానున్నారు. భారత అమెరికన్లను కలుసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం జూన్ 24, 25 తేదీల్లో ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని హోదాలో మోడీ తొలిసారిగా ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు.