NTV Telugu Site icon

Central Cabinet Decisions: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక

Ashwinivaishnaw

Ashwinivaishnaw

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక అందించింది. ఉద్యోగులందరికీ 8వ వేతన సంఘాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.3,985 కోట్ల వ్యయంతో ఇస్రో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏడవ వేతన సంఘం పదవీకాలం 2026లో ముగుస్తుంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు.

2014లో 7వ వేతన సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సిఫార్సులు జనవరి 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. పే కమీషన్లు, ఉద్యోగుల వేతన నిర్మాణం, స్కేల్‌ను మార్చడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 1947 నుంచి ఏడు పే కమిషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. చివరిది 2016లో అమలు చేయబడింది.

ఇది కూడా చదవండి: Brahmanandam: నాకు వేషాలు లేక.. ఇవ్వక కాదు.. అందుకే సినిమా చేయడం తగ్గించా!

8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతభత్యాలు, కరవు భత్యం, పెన్షన్ పెరగనున్నాయి. చాలా కాలంగా ఈ ప్రకటన కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి కానుకగా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Brahmanandam: బ్రహ్మానందానికి శేఖర్ కమ్ముల ఇంత దగ్గరి చుట్టమా?