Site icon NTV Telugu

PM Modi: విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే.. బీహార్ ర్యాలీలో మోడీ ధ్వజం

Modi4

Modi4

మహాఘట్‌బంధన్‌లో ఉన్నవారంతా నేరస్థులేనని.. వారంతా బెయిల్‌పై తిరుగుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రధాని మోడీ బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరి ఠాకూర్‌కు నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ… విపక్ష కూటమిపై ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో ఆత్మాహుతి కుట్ర భగ్నం.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

బీహార్‌కు ఇంకో లాంతరు అవసరం లేదన్నారు. ఇంత వెలుతురు ఉన్నప్పుడు.. మనకు ఇంకో లాంతరు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనసమూహాన్ని తమ మొబైల్ టార్చిలైట్లను ఆన్ చేసుకోవాలని కోరారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని మహాఘట్‌బంధన్ కూటమిని ఎగతాళి చేశారు.

కర్పూరీ ఠాకూర్‌ను అవమానిస్తే బీహార్ సహించదని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన దార్శనికతను ప్రజలకు శ్రేయస్సుగా మారుస్తోందని అన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ నాయకులు ‘‘వేల కోట్ల రూపాయల కుంభకోణాలలో బెయిల్‌పై బయట ఉన్నారు’’. అని ఆరోపించారు. వాళ్లంతా ఇప్పుడు కర్పూరి ఠాకూర్ ‘‘వారసత్వం, బిరుదును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు.’’ అని ధ్వజమెత్తారు. గౌరవనీయ నాయకుడికి జరిగిన ఈ అవమానాన్ని బీహార్ ప్రజలు ఎప్పటికీ సహించరని.. ఓట్లతో గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Piyush Pandey: ఫెవికాల్, వొడాఫోన్ ప్రకటనల సృష్టికర్త పియూష్ పాండే కన్నుమూత

‘‘జీఎస్‌టీ బచత్ ఉత్సవ్.’’ ప్రయోజనాలను బీహార్ ప్రజలు పొందుతున్నారని తెలిపారు. ఛత్ పూజ పండుగకు ముందు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ కొత్త వేగంతో ముందుకు సాగుతుందని’’ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి వేగవంతమైన అభివృద్ధి, శ్రేయస్సును హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్యం యొక్క గొప్ప పండుగ అని అభివర్ణించారు. బీహార్‌లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

2005 అక్టోబర్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్ ‘‘జంగల్ రాజ్’’ నుంచి విముక్తి పొందిందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 10 సంవత్సరాలు పాలించినప్పుడు.. బీహార్ అభివృద్ధికి నిరంతరం అడ్డంకులు సృష్టించారని మోడీ ఆరోపించారు.

Exit mobile version