Site icon NTV Telugu

PM Modi: రేపటి నుంచే బీహార్‌లో మోడీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ నుంచంటే..!

Pmmodi3

Pmmodi3

ప్రధాని మోడీ శుక్రవారం బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరి ఠాకూర్‌ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సమస్తిపూర్‌లో భారతరత్న కర్పూరి ఠాకూర్‌కు మోడీ నివాళులర్పించనున్నారు. అనంతరం సమస్తిపూర్, బెగుసరాయ్‌ల్లో ఎన్నికల ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ వెల్లడించారు.

కర్పూరి ఠాకూర్ కుమారుడు, కేంద్ర మంత్రి, జేడీయూ నేత రామ్‌నాథ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పర్యటన ఆకస్మిక ప్రణాళిక అని.. ఇది ఎన్నికలకు ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మోడీ ర్యాలీలు ఉంటాయని తెలిపారు.

కర్పూరి ఠాకూర్‌కు గత సంవత్సరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. ఆయన మరణించిన 35 సంవత్సరాల ఈ పురస్కరం లభిచింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ అవార్డు లభించింది. కర్పూరి ఠాకూర్ ఫిబ్రవరి 17, 1988న మరణించారు.

కర్పూరి ఠాకూర్ ఎవరు?
‘జన్నాయక్’ లేదా పీపుల్స్ లీడర్‌గా ఠాకూర్ పేరు సంపాదించారు. నాయి (బార్బర్) వర్గానికి చెందిన ఒక చిన్నకారు రైతు కుమారుడు. రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. డిసెంబర్ 1970- జూన్ 1971 మధ్య భారతీయ క్రాంతి దళ్‌లో భాగంగా సీఎంగా పని చేశారు. డిసెంబర్ 1977-ఏప్రిల్ 1979 మధ్య జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రిగా పని చేశారు. 1978లో ప్రభుత్వ సేవల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అత్యంత వెనుకబడిన తరగతుల (ఇబీసీలు) (ముస్లింలలోని బలహీన వర్గాలతో సహా) వర్గాన్ని తగ్గించడంలో ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. మెట్రిక్యులేషన్ పరీక్షలకు తప్పనిసరి సబ్జెక్టుగా ఇంగ్లీషును తొలగించడం. మద్యపాన నిషేధానికి కూడా ఠాకూర్ ప్రసిద్ధి చెందారు. ఠాకూర్ ప్రజలచే ప్రేమించబడటమే కాకుండా ప్రతిపక్షాలచే కూడా గౌరవింపబడ్డారు.

కర్పురి గ్రామమే ఎందుకు ముఖ్యమైనది?
2022లో నిర్వహించిన కుల గణన ప్రకారం రాష్ట్ర జనాభాలో ఈబీసీలు 36 శాతం ఉన్నారు. EBCలకు తరచుగా విద్య, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అవకాశం, ప్రాథమిక సామాజిక సేవలు అందుబాటులో ఉండవు. EBCలు SC లేదా ST లాగా ప్రత్యేక రాజ్యాంగ వర్గం కాదు. వారు సాధారణంగా OBC (ఇతర వెనుకబడిన తరగతులు) వర్గంలోని ఉప సమూహం. OBCలలో అత్యంత అణగారిన కులాలను గుర్తించడానికి ఇది సృష్టించబడింది. కర్పూరి గ్రామంంలో ఈబీసీలు ఎక్కువగా ఉండడంతో మోడీ ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు.

ఇది కూాడా చదవండి: Bihar Elections: బీహార్ ఇండియా కూటమి సీఎం అభ్యర్థి ప్రకటన.. ఎవరంటే..!

Exit mobile version