90s కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఈటీవీ విన్‌తో కలిసి, హైదరాబాద్‌లో జరిగిన పూజా వేడుకతో తమ తొలి ప్రొడక్షన్ ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరై టీంకి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత రవిశంకర్ (మైత్రి మూవీ మేకర్స్) కెమెరా స్విచ్ ఆన్ చేశారు, దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ క్లాప్ కొట్టారు, నిర్మాత SKN ముహుర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.
Also Read :7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, IP69 రేటింగ్‌తో Realme 15x 5G లాంచ్.. ధర ఎంతంటే?
బన్నీ వాస్, మెహర్ రమేష్, ప్రసాద్ నిమ్మకాయల, నిఖిల కోనేరు వంటి పరిశ్రమ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీంకి బెస్ట్ విషెస్ అందించారు. వినోద్ గాలి దర్శకత్వంలో 90స్ కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, బలమైన భావోద్వేగంతో కూడిన బడ్డీ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా వుంటుందని అంటున్నారు. విరాజ్ అశ్విన్, ప్రియ దర్శిని రామ్, బాబు మోహన్, యశశ్రీ రావు, పవన్ సిద్ధు, టేస్టీ తేజ, సూర్య గోపీనాథ్, శివన్నారాయణ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.