ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలకు ప్రత్యేక విందు ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత గురువారం సాయంత్రం కళ్యాణ్ మార్గ్‌లో తన నివాసంలో ఈ విందు ఇచ్చారు. ఎన్డీఏ ఎంపీలకు విందు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎక్స్‌లో మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశం జాతీయ అభివృద్ధి, ప్రాంతీయ ఆకాంక్షలకు ఉమ్మడి నిబద్ధతను సూచిస్తుందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్ధి కోసం కలిసి పని చేస్తూనే ఉంటామని చెప్పారు.
మెనూ స్పెషల్ ఇదే..
ఎంపీలకు ఇచ్చిన విందులో పూర్తి శాఖాహార మెనూకే ప్రాధాన్యత ఇచ్చారు. గోంగూర పన్నీర్, పాలకూర పప్పు హైలైట్‌గా నిలిచాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వడ్డించిన శాఖాహార భోజనమే ఎంపీలకు వండించినట్లు సమాచారం.
