Site icon NTV Telugu

PM Narendra Modi: గాజా విషయంలో, ట్రంప్‌కు మోడీ అభినందనలు..

Modi Trump

Modi Trump

PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందం కుదరడంపై మోడీ, ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశం-అమెరికా వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు. “నా స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడి చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడం పట్ల ఆయనకు అభినందనలు తెలిపాను. వాణిజ్య చర్చలలో సాధించిన మంచి పురోగతిని కూడా సమీక్షించాను.” అని మోడీ ట్వీట్ చేశారు.

Read Also: Rahul Gandhi: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

అక్టోబర్ 07, 2023లో హమాస్ ఇజ్రాయిల్‌పై దాడులు చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా, ఇతర పాలస్తీనా భూభాగాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 60 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ మరణాలను ఆపడానికి ట్రంప్ ఇజ్రాయిల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు.

Exit mobile version