PM Narendra Modi: “మజెల్ తోవ్ మై ఫ్రెండ్”.. బెంజమిన్ నెతన్యాహూకు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Congratulates Israel’s Netanyahu: ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ ఇజ్రాయిల్ పార్లమెంట్ లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి యాయిర్ లాపిడ్ తన పరాజయాన్ని అంగీకరించారు. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత నెతన్యాహుకు అభినందనలు తెలిపారు. 99 శాతం ఓట్ల లెక్కింపు తర్వాత నెతన్యాహు పార్టీ 120 సీట్లకు గానూ 64 సీట్లను కైవసం చేసుకుంది.
Read Also: Woman Mystery Case: వీడిన వివాహిత హత్య కేసు మిస్టరీ.. అతడే కాలయముడు
Also Read
ఇజ్రాయిల్ ఎన్నికల్లో ఘన విజయం సాాధించిన నెతన్యాహును అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. హిబ్రూ భాషలో ‘‘ మాజెల్ తోవ్ మై ఫ్రెండ్’’ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. రైటిస్ట్ పార్టీ అయిన లికుడ్ పార్టీ దాని మిత్ర పక్షాలు తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ప్రధాని మోదీ నెతన్యాహుకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు భారత్-ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఇరు దేశాలు ప్రయత్నాలు కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. భారతదేశం-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇచ్చినందుకు యైర్ లాపిడ్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
గత కొన్నేళ్లుగా దేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరతకు నెతన్యాహు చెక్ పెట్టారు. 2019లో అవినీతి ఆరోపణలు, లంచం, విశ్వాస ఉల్లంఘన వల్ల పదవి నుంచి దిగిపోయిన తర్వాత లెఫ్ట్ భావజాలం కలిగిన యాయిర్ లాపిడ్, నఫ్తాలీ బెన్నెట్, అరబ్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. అయినా కూడా కూటమిలో లుకలుకలు దేశ రాజకీయాల్లో అస్థిరతను పెంచాయి. దీంతో ఈసారి ప్రజలు మరోసారి నెతన్యాహు వైపే మొగ్గు చూపారు. ఇజ్రాయిల్ కు ఎక్కువ కాలం పనిచేసిన రికార్డు నెతన్యాహు పేరున ఉంది. ఇక మరోసారి ఇజ్రాయిల్ ప్రధాని పీఠాన్ని నెతన్యాహు అధిష్టించనున్నారు.
Mazel Tov my friend @netanyahu for your electoral success. I look forward to continuing our joint efforts to deepen the India-Israel strategic partnership.
— Narendra Modi (@narendramodi) November 3, 2022
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!