NTV Telugu Site icon

PM Modi: న్యూ ఓర్లీన్స్‌లో ఉగ్రవాదుల దాడిని ఖండించిన మోడీ

Modi

Modi

అగ్ర రాజ్యం అమెరికాలో నూతన సంవత్సరం రోజున జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని మోడీ ఖండించారు. న్యూ ఓర్లీన్స్‌లో ఒక పికప్ ట్రక్కు అత్యంత వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా… పలువురు గాయపడ్డారు. తాజాగా ఈ దాడిని ప్రధాని మోడీ ఖండించారు. పిరికిచర్యగా అభివర్ణించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని.. మృతుల కుటుంబాలు సంతాపం వ్యక్తం చేస్తూ.. దు:ఖంలోంచి బయట పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ధైర్యం, నెమ్మది లభించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ ట్విట్టర్‌లో మోడీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Indian Snakeroot: ఈ ఒక్క మొక్క పెంచండి.. మీ ఇంటి పరిసరాల్లో పాములు అస్సలు రావు..

న్యూఇయర్ సందర్భంగా న్యూ ఓర్లీన్స్ ప్రఖ్యాత ఫ్రెంచ్ క్వార్టర్‌లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ప్రజలు ఆనందోత్సవాలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతలోనే ఒక డ్రైవర్ మారణహోమం సృష్టించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. నిందితుడిని అంతమొందించారు. ఇక ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు కోలుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Shankar: హాలీవుడ్ ఇండియన్ సినిమా వైపు చూస్తోంది.. శంకర్ కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే ట్రక్కుపై ఐఎస్ఐఎస్ గ్రూప్‌నకు చెందిన జెండా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ దాడిని ఉగ్ర దాడిగా పేర్కొంటున్నట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

 

Show comments