Shankar: హాలీవుడ్ ఇండియన్ సినిమా వైపు చూస్తోంది.. శంకర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ‘గేమ్ చేంజర్ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. సోషల్ కమర్షియల్, మాస్, ఎంటర్టైనర్‌గా ఉంటుంది. ఓ పొలిటికల్ లీడర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ. హీరో పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. అందరూ శంకరాత్రి అని అంటున్నారు కానీ ఇది రామ నవమి. రామ్ చరణ్ తన పాత్రల్లో ఒదిగిపోయారు. అక్కడ రామ్ చరణ్ కాకుండా మీకు ఆ పాత్రలే కనిపిస్తాయి. అంత అద్భుతంగా కనిపిస్తారు. సాంగ్స్, యాక్షన్స్, పర్ఫామెన్స్ ఇలా అన్నింట్లో అద్భుతంగా నటించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామ్ చరణ్‌ను చూసేందుకే జనాలు వచ్చేస్తారు. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ అందరి హృదయాల్ని గెలిచేస్తారు. కియారా అద్వాణీ రామ్ చరణ్ తో పాటు అద్భుతంగా డాన్స్ చేశారు. అంజలి తన నటనతో పాత్రకు జీవం పోశారు. ఎస్ జే సూర్య లాంటి యాక్టర్స్‌ని చాలా అరుదుగా చూస్తుంటాం. ఒక్కో సీన్, ఒక్కో షాట్‌ను ఎంతో పర్ఫెక్ట్‌గా చేస్తారు. తమన్ నా నమ్మకాన్ని నిలబెట్టి సంగీతం ఇచ్చారు. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చారు. డీఓపీ తిరు ఒక్కో విజువల్‌ను ఐ క్యాచీగా ఇచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ఫ్రా రెడ్ టెక్నాలజీ వాడాం. పాటలకు చాలా వరకు కొత్త టెక్నాలజీ వాడాం. జరగండి సెట్‌ను ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల అద్భుతంగా వేశారు. రామకృష్ణ వేసిన డోప్ సాంగ్ సెట్ బాగా వచ్చింది.
Israel-Hamas: హమాస్ భద్రతా దళాల అధిపతిని లేపేసిన ఇజ్రాయెల్
Also Read
ఎడిటర్ రూబెన్ ఈ సినిమాను రేసీగా కట్ చేశారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఓ ఐదు నిమిషాలు గ్యాప్ దొరికినా ఫోన్ చూసేస్తుంటారు. కానీ అలా పక్కకి తిప్పుకోనివ్వకుండా అద్భుతంగా కట్ చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా అద్భుతంగా వచ్చింది. కార్తిక్ సుబ్బరాజ్ వద్ద కథను తీసుకుని ఈ మూవీని చేశాను. ఇది కూడా నాకు ఓ గేమ్ చేంజర్ లాంటిదే. సాయి మాధవ్ బుర్రాఅద్భుతమైన డైలాగ్స్ రాసిచ్చారు. పక్కా తెలుగు ఫ్లేవర్ ఉండేలా రాసిచ్చారు. ప్రభుదేవాజరగండి సాంగ్‌ను ఫ్రీగా చేశారు. రామ్ చరణ్ గారి మీద ప్రేమతో, దిల్ రాజుప్రేమతో ఆయన ఉచితంగా చేశారు. రా మచ్చా పాటను గణేష్ ఆచార్య చేశారు. ప్రతి కొరియోగ్రాఫర్ రామ్ చరణ్ మీద చాలా పెద్ద షాట్స్, స్టెప్స్ వేయించారు. ప్రేమ్ రక్షిత్ సోలో ఫుల్ సాంగ్ చేశారు. జానీ మాస్టర్ డూప్ సాంగ్ చేశారు. నేను ఏదో కొత్తగా ఆలోచిస్తే నాకంటే కొత్తగా ఆలోచించి కొరియోగ్రఫీ చేశారు. హైరానా పాటను బాస్కో మాస్టర్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. శాండీ బిట్ సాంగ్ చేశారు. అన్బరివ్ యాక్షన్స్ అద్భుతంగా వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి , అనంత శ్రీరామ్ , కాసర్ల శ్యాంఓ ఫోక్ సాంగ్ రాసిచ్చారు. హాలీవుడ్‌లా మనం తీయాలని అనుకుంటాం. కానీ హాలీవుడ్ కూడా ఇప్పుడు మనలా సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. దానికి కారణం రాజమౌళి . జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతోంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!