Site icon NTV Telugu

PM Modi: ఏఐ కంటెంట్ పై వాటర్‌మార్క్ తప్పనిసరి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

Modi

Modi

PM Modi: విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సాయంతో తయారయ్యే కంటెంట్‌కు అది కృత్రిమ మేధతో రూపొందించబడింది అనే విషయం స్పష్టంగా తెలిసేలా వాటర్‌మార్క్ తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. ఏఐను తప్పుగా ఉపయోగించకుండా ఉండేందుకు భారత్ కఠిన నియంత్రణ చర్యలు చేపడుతోందని అన్నారు. ఏఐ ఆధారిత కంటెంట్‌పై స్పష్టమైన గుర్తింపు ఉండటంతో తప్పుడు ప్రచారం, మోసాలు, డీప్‌ఫేక్‌లను నియంత్రించడంలో సహాయపడుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Read Also: Google Lyria 3: మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక దుకాణాలు మూసేయల్సిందేనా? మీకు నచ్చిన పాటను సెకన్లలో ‘లిరియా 3’తో సృష్టించండి ఇలా..

అయితే, కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు ఈ వేదిక దోహదం చేస్తుంది అని ప్రధాని మోడీ అన్నారు. ఏఐలో విజన్‌తో పాటు సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యం.. మనం అణుశక్తి విధ్వంసాన్ని చూశాం, వికాసాన్ని చూశాం, ఏఐ కూడా అంతే.. ఏఐ కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రం వంటిది.. భారత్‌కు యువత కొత్త శక్తిగా, ఆస్తిగా మారారు.. ఏఐ టెక్నాలజీ వినియోగం, వాటి ఫలితాలపై తుది నిర్ణయం మనిషిదే అయి ఉండాలని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Read Also: Tilak Varma Form: సూపర్-8కు ముందు ‘తిలక్’ తలనొప్పి.. ఆ ఒక్క ఇన్నింగ్స్ మినహా అంతా డొల్ల!

ఇక, ఏఐ మెషీన్ సెంట్రిక్గా కాదు.. హ్యుమన్ సెంట్రిక్గా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏఐ మనల్ని కాదు, మనం ఏఐని శాసించాలి అని సూచించారు. ఏఐకి మనం ముడి సరుకుగా ఉండకూడదు.. అన్ని రంగాల్లో సమస్యలకు ఏఐ పరిష్కారం చూపిస్తుంది.. పార దర్శకత్వమే అన్నింటికంటే ఉత్తమమైన రక్షణ కవచం అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Exit mobile version