Site icon NTV Telugu

Breaking News: మోడీ అధ్యక్షతన అత్యున్నత CCS సమావేశం..

Pm Modi

Pm Modi

Breaking News: పశ్చిమాసియా పరిణామాలు, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం రాత్రి అత్యున్నత సమావేశం జరగబోతోంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశం కానుంది. తమిళనాడు పర్యటన తర్వాత ఆదివారం రాత్రి మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత సేవాతీర్థ్‌లో ఈ సమావేశంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయుల రక్షణ గురించి చర్చించే అవకాశం ఉంది.

Exit mobile version