PM Modi: ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్బుక్ ఐడీ ఎక్కడదంటే..!
- ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు
- ఫేస్బుక్ ఐడీని గుర్తించిన పోలీసులు
- భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మోడీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో హత్య బెదిరింపు రావడంతో ఆస్ట్రేలియా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బెదిరింపు సందేశం పోస్టు చేసిన వ్యక్తికి సంబంధించిన ఐపీ అడ్రస్‌ను గుర్తించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రధాని మోడీ జూలై 8 నుంచి 10 వరకు మెల్బోర్న్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ఫేస్బుక్లో బెదిరింపు సందేశం
స్థానిక మీడియా కథనం ప్రకారం.. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరగనున్న ‘‘Melbourne Meets Modi’’ కార్యక్రమానికి సంబంధించిన ఫేస్బుక్ పోస్టు కింద ‘‘అబు ముస్తఫా’’ (Abu Mustafa) పేరుతో ఉన్న ఖాతా నుంచి బెదిరింపు వ్యాఖ్య పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలో ‘‘కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం పైకప్పు మూసి ఉంచడం మంచిది. లేకపోతే ఆయన ఆస్ట్రేలియాకు తన మరణం కోసం వస్తారు.’’ అంటూ హెచ్చరిక చేశారు. ఈ బెదిరింపు పోస్టుకు సంబంధించిన ఐపీ అడ్రస్‌ను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇది క్రిమినల్ నేరం కిందకు వస్తుందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేసినట్లు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ అధికారికంగా ప్రకటించలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలను వెల్లడించలేమని పేర్కొంది.
Also Read
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- Punjab Politics: ఆప్‌పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
- PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
- CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
భద్రతపై ప్రత్యేక దృష్టి
ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆస్ట్రేలియాలోని పలు భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ బెదిరింపును అత్యంత తీవ్రంగా పరిగణిస్తూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పర్యటనలో ప్రధాని మోడీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అంతేకాకుండా ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలో పాల్గొని ఇరు దేశాల ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే భారీ సంఖ్యలో హాజరుకానున్న భారతీయ ప్రవాసులను కూడా ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
Kannada Stars : యశ్ పాన్ – ఇండియా రేంజ్‌ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!