Site icon NTV Telugu

PM Modi: ఫిబ్రవరిలో కేంద్రమంత్రులు ఎవరూ అయోధ్యకు వెళ్లొద్దని ప్రధాని ఆదేశాలు.. కారణమిదే..

Pm Modi

Pm Modi

PM Modi: అయోధ్యలో భవ్య రామమందిరంలో రామ్ లల్లా కొలువుదీరారు. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా సోమవారం రోజున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆలయ ట్రస్టు ఆహ్వానాలు అందించడంతో వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్లొద్దని ప్రధాని నరేంద్రమోడీ కోరినట్లు సమాచారం.

Read Also: Janasena: జనసేనలో చేరిన 30 ఇయర్స్ పృథ్వి.. శ్యాంబాబు వేషధారణతో ప్రచారం!

ప్రాణ ప్రతిష్ట తర్వాత దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యను సందర్శించేందుకు వస్తున్నారు. అయితే ఒక వేళ కేంద్ర మంత్రులు వెళ్తే ప్రోటోకాల్ సమస్యలతో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని దీంతోనే కేంద్రమంత్రులు ఫిబ్రవరి నెలలో అయోధ్యకు వెళ్లొద్దని ప్రధాని కోరినట్లు తెలుస్తోంది. మార్చి నెలలో కేంద్రమంత్రులు అయోధ్య రామ మందిర సందర్శనకు వెళ్తారని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో, అయోధ్య రామ మందిరంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయని ప్రధాని మంత్రుల్ని అడిగారని తెలుస్తోంది.

సోమవారం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభమైంది. సాధారణ ప్రజల కోసం మంగళవారం నుంచి దర్శనాలు మొదలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు రాముడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో దర్శనానికి కాసేపు విరామం ఇవ్వాల్సి వచ్చింది. భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యలోకి అన్ని వాహనాల ఎంట్రీపై అధికారులు నిషేధం విధించారు.

Exit mobile version