PM Modi: 3 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోడీ

  • 3 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోడీ
  • ఈ నెల 16 నుంచి నైజీరియా.. బ్రెజిల్.. గయానాలో పర్యటన
Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 16న నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తొలుత ప్రధాని మోడీ నైజీరియాలో పర్యటించారు. అనంతరం జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు బ్రెజిల్ వెళ్లారు. అక్కడ ఆయా దేశాధినేతలతో మోడీ సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఆయా ప్రధాన అంశాలపై చర్చించారు. బ్రెజిల్ పర్యటన అనంతరం నేరుగా గయానాకు బయల్దేరి వెళ్లారు. అక్కడ మోడీకి ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇక ఆ దేశ అత్యున్నత పురస్కరాలతో మోడీని సత్కరించారు. అలాగే గయానా దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం భారతీయులతో సమావేశమై ముచ్చటించారు.

ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌లో దిగిన చైనా ప్రైవేట్ ఆర్మీ.. కారణం ఇదే..

మూడు దేశాల పర్యటనకు వెళ్లకముందు మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రధాని మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. పలుచోట్ల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే మూడు దేశాల పర్యటన కోసం నవంబర్ 16న బయల్దేరి వెళ్లారు. తిరిగి వారం రోజుల తర్వాత భారత్ చేరుకున్నారు.