Site icon NTV Telugu

PM Modi: నేడు హర్యానా, జమ్మూలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..

Modi

Modi

PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానా రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ఇరు రాష్ట్రాల ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. కాగా, మోడీ షెడ్యూల్ ను బీజేపీ తన అధికారికి ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో తెలిపింది.

Read Also: Rani Laxmibai: రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని వ్యతిరేకించిన వక్ఫ్.. కోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణలు!

ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు జమ్మూ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జమ్మూలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.. ఆ తర్వాత ఇక్కడి నుంచి ప్రధాని మోడీ హర్యానాకు చేరుకుంటారు. హిసార్‌లో నిర్వహించే బీజేపీ భారీ బహిరంగ సభలో మధ్యాహ్నం 3 గంటలకు పాల్గొని ప్రసంగిస్తారు. అయితే, ప్రధాని ఎన్నికల పర్యటనతో రెండు రాష్ట్రాల బీజేపీ నాయకత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది. నరేంద్ర మోడీ బహిరంగ సభలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర భద్రతా బలగాలతో పాటు రాష్ట్రాలు కూడా కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశాయి.

Exit mobile version