Site icon NTV Telugu

PM Modi: భారత్‌ను రెండుసార్లు విభజించిందే నెహ్రూ.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్!

Modi

Modi

PM Modi: భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు. దీంతో దేశంలో వ్యవసాయానికి భారీ నష్టం జరిగిందన్నారు. కొంత కాలానికి పాకిస్తాన్‌తో తాను చేసుకున్న సింధూ నది ఒప్పందంతో 80 శాతం నీరు ఆ దేశానికి వెళ్లిపోయాయని.. భారత్‌కు మాత్రం ఎలాంటి ప్రయోజనం దక్కలేదనే విషయాన్ని నెహ్రూనే స్వయంగా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. కాబట్టి, కాంగ్రెస్‌ పార్టీ రైతుల వ్యతిరేకి అనే దానికి ఆయన తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని ప్రధాని మోడీ విమర్శించారు.

Read Also: Anakapalli: ఏపీ హోంమంత్రి అనిత నియోజకవర్గంలో భారీగా గంజాయి పట్టివేత!

కాగా, రాజ్యాంగం కల్పించిన వాక్‌ స్వాతంత్య్రపు హక్కును తొలగించేందుకు నెహ్రూ ప్రభుత్వంలో రాజ్యాంగ సవరణ చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కాగా, ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను ఆయన పెంచారని ఆరోపణలు చేశారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్‌ సర్కార్ ఎప్పుడూ కృషి చేయలే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వారి అభివృద్ధి స్టార్ట్ అయిందని గుర్తు చేశారు. ఎన్డీయే పాలనలో దేశం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా ప్రయాణం కొనసాగిస్తుందన్నారు.

Exit mobile version