Site icon NTV Telugu

Pulwama encounter: దయచేసి లొంగిపో.. ఉగ్రవాదితో తల్లి పలికిన మాటలు వైరల్

Pulwamaencounter

Pulwamaencounter

జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లా, గురువారం తెల్లవారుజాము. నాదర్, ట్రాల్ ప్రాంతం. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ ద్వారా ముగ్గురు ఉగ్రవాదుల కదలికలను ఓ ఇంట్లో గమనించారు. అదే సమయంలో మాతృమూర్తి మనసు తల్లడిల్లింది. ఉగ్రవాది అమీర్ నజీర్‌కు వీడియో కాల్ చేసింది. దయచేసి లొంగిపో అంటూ ప్రాధేయపడింది. బతిమాలింది. కానీ ముష్కరుడి మనసు మాత్రం కరగలేదు. తీవ్రవాదం ముందు కన్నప్రేమ ఓడిపోయింది. అంతే క్షణాల్లోనే భద్రతా దళాల కాల్పుల్లో అమీర్ నజీర్ హతమయ్యాడు. అయితే అందుకు సంబంధించిన వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Off The Record: బీఆర్ఎస్ సెల్ఫ్ డిఫెన్స్‌లో పడిందా..? ఎందుకలా జరుగుతోంది?

పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం కలిగిన ముగ్గురు ఉగ్రవాదులు అమీర్ నజీర్ వాని, ఆసిఫ్ అహ్మద్ షేక్, యావర్ అహ్మద్ భట్.. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. అంతకముందు అమీర్ నజీర్‌కు తల్లి ఫోన్ చేసి లొంగిపోవాలని బతిమాలింది. కానీ లెక్క చేయలేదు. అలాగే ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరి కూడా ఫోన్ చేసి లొంగిపోవాలని సోదరిడిని వేడుకుంది. కానీ పట్టించుకోలేదు. కొన్ని క్షణాల్లోనే ముగ్గురు ఉగ్రవాదలు హతం అయ్యారు. వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఉగ్రవాదులు ఏకే-47 రైఫిల్స్ పట్టుకుని ఉన్నట్లు కనిపించారు.

ఇది కూడా చదవండి: Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం

ఆపరేషన్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వికె బిర్డి మాట్లాడుతూ.. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈ ముగ్గురికి ఏదైనా సంబంధం ఉందా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

 

Exit mobile version