Supreme Court: ఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన చిన్నారుల మరణాల ఘటనపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ విశాల్ తివారీ. ఆర్టికల్ 32 కింద పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేస్తూ, డయీథిలీన్ గ్లైకాల్ (DEG) కలిగిన దగ్గుమందు వల్ల 14 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలో ఉపయోగించిన దగ్గు మందులో డయీథిలీన్ గ్లైకాల్ (DEG) అనే పారిశ్రామిక విషపదార్థం ఉన్నట్లు బయటపడింది. ఇది ఔషధ తయారీలో వాడటం నిషేధిత రసాయనం అని తన పిటిషన్ లో పేర్కొన్నారు.
Read Also: పీపీపీకి వ్యతిరేకంగా డైరక్ట్ యాక్షన్‌లోకి వైఎస్ జగన్
ఇప్పటికే తమిళనాడు ఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. తమిళనాడు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల నివేదికలో తయారీ స్థలాల్లో అపరిశుభ్ర వాతావరణం, బ్యాచ్ నంబర్ల లోపాలు, నాణ్యత నియంత్రణ లోపాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా దగ్గు మందుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో, సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
పిల్‌లో ప్రధాన డిమాండ్లు
* రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి
* విషమందుల తయారీ, నియంత్రణ, పరీక్షల వ్యవస్థపై సమగ్ర దర్యాప్తు జరపాలి.
* చిన్నారుల మరణాలపై సీబీఐ విచారణ జరపాలని, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో రాష్ట్రాలవ్యాప్తంగా దర్యాప్తు జరగాలని కోరారు.
* ఈ ఘటనలకు సంబంధించిన అన్ని FIRలను సీబీఐకి బదిలీ చేయాలని కోరిన అడ్వకేట్
* తమిళనాడులోని స్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్రిఫ్ దగ్గుమందు బ్యాచ్‌లను వెంటనే వెనక్కి రప్పించాలి. వాటన్నిటిని నిషేధించాలి.