NTV Telugu Site icon

Delhi Assembly Elections: కేజ్రీవాల్‌కి షాక్, పెరిగిన బీజేపీ గ్రాఫ్.. ఢిల్లీలో గెలుపుపై తాజా సర్వే..

Delhi Assembly Elections

Delhi Assembly Elections

Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమైంది. రేపు(ఫిబ్రవరి 05)న ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 36. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 5 గంటలోపు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం ఉంటుంది.

Read Also: Layoffs 2025: ఉద్యోగాలకు ఎసరుపెడుతున్న AI.. 2025లో భారీగా టెక్ లేఆఫ్స్..

ఇదిలా ఉంటే, ఢిల్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు ‘‘ఫలోడి సట్టా బజార్’’ ఎన్నికల అంచనాలను వెల్లడించింది. నిజానికి ఓటింగ్‌కి కొన్ని రోజుల ముందు వరకు సట్టా బజార్ అంచనాలు ఆప్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. ఆప్ మరోసారి అధికారం ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం పరిస్థితి దాదాపుగా మారిపోయింది. బీజేపీ గ్రాఫ్ చాలా పెరిగింది. ఆప్‌కి అరవింద్ కేజ్రీవాల్‌కి భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ప్రిడిక్షన్ చెప్పింది.

ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఆప్‌కి 35-37 సీట్లు రావచ్చని, బీజేపీకి 33-35 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోతారనే అంచనాను వెల్లడించింది. ఈ అంచనాలే నిజమైతే, ఆప్‌కి ఈసారి ఎన్నికల్లో షాక్ తప్పకపోవచ్చే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక రోజు ముందు గతంలో బీజేపీకి 31-33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటులో కేజ్రీవాల్, బీజేపీ నుంచి ప్రవేశ్ శర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ పోటీలో ఉన్నారు.