NTV Telugu Site icon

JNU: జెఎన్‌యూలో ఉద్రిక్తత.. పెరియార్, కార్ల్ మార్క్స్ ఫోటోలు ధ్వంసం..

Jnu

Jnu

Periyar, Karl Marx photos ‘vandalised’ at JNU: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ)లో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ అనుబంధం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) పెరియార్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే మొదలైన వారి ఫోటోలను ధ్వంసం చేశారని వామపక్ష విద్యార్థి విభాగం(ఎస్ఎఫ్ఐ), జెఎన్‌యూ విద్యార్థి సంఘం సోమవారం ఆరోపించింది. ఇది ఏబీవీపీ పనే అని జెఎన్‌యూఎస్యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ ట్వీట్ చేశారు. క్యాంపస్ లో మతసామరస్యానికి ఏబీవీపీ భంగం కలిగిస్తోందని ఆరోపించింది.

Read Also: Tipu Sultan Issue: టిప్పు పేరు వాడకండి.. చర్యలు తీసుకుంటామని వారసుల హెచ్చరిక

ఈ చర్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఖండించారు. తమిళ విద్యార్థులపై దాడులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, తమిళ విద్యార్థులకు రక్షణ కల్పించాలని వైస్ ఛాన్సలర్‌ను అభ్యర్థించారు. జెఎన్‌యూలో పెరియార్, కార్ల్ మార్క్స్ వంటి నాయకుల చిత్రాలను ధ్వంసం చేయడం, తమిళ విద్యార్థులపై ఏబీవీపీ దాడి చేయడం పిరికిపంద చర్య అని, అత్యంత ఖండనీయమని, యూనివర్శిటీ అడ్మిన్‌ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని స్టాలిన్ ట్వీట్ చేశారు.

ఆదివారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటాన్ని అపవిత్రం చేయడం వెనక వామపక్ష విద్యార్థి సంఘం విద్యార్థులు ఉన్నారని.. ఏబీవీపీ ఆరోపించింది. మరోవైపు ఇటీవల ఐఐటీ బాంబేలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతూ మార్చ్ చేస్తున్న విద్యార్థులపై ఏబీవీపా దాడులు చేసిందని, జెఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఏబీవీపీ ఖండించింది. ఈ ఘర్షణల నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Show comments