Site icon NTV Telugu

Sanjay Raut: ప్రజలు దీన్ని సహించరు.. అజిత్ పవార్ తిరుగుబాటుపై సంజయ్ రౌత్..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు షాక్ ఇస్తూ.. షిండే-ఫడ్నవీస్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏకంగా 40 మంది అజిత్ పవార్ వెంట నిలిచారు. ఆదివారం అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా మంత్రి వర్గంలో చేరగా.. మరో 9 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు.

Read Also: Ajit Pawar: మహరాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్.. మంత్రులుగా 9 మంది ఎన్సీపీ నేతలు

ఎన్పీపీలో చీలక గురించి తాను ఇప్పుడే శరద్ పవార్ తో మాట్లాడానని ఉద్దశ్ ఠాక్రే వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ‘‘కొందరు మహారాష్ట్ర రాజకీయాలను శుభ్రం చేసే పనిని చేపట్టారు.. వారిని అదే పనిలో ఉండనివ్వండి.. నేను శరద్ పవార్ తో ఇప్పుడే మాట్లాడాను.. నేను బలంగా ఉన్నానని, ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మళ్లీ అన్నింటిని పునర్నిర్మిస్తాం శరద్ పవార్ చెప్పారు’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ప్రజలు దీనిని సహించరని ఆయన అన్నారు. ఈ తిరుగుబాటుపై ఉద్ధవ్ వర్గం మరోనే ప్రియాంక చతుర్వేది కూడా స్పందించారు. ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేలు గతంలో అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లారని.. వారు అధికారం కోసం ఏమైనా చేసే అవకాశవాదులేని ఆమె అన్నారు. సిధ్దాంతాల గురించి చివరగా మాట్లాడే పార్టీ ఏదైనా ఉందా..? అంటే అది బీజేపీనే అని ఆమె విమర్శించారు.

Exit mobile version