NTV Telugu Site icon

Kejriwal: మహిళలపై నేరాల్లో తొలి స్థానంలో ఢిల్లీ.. అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ..!

Arvind

Arvind

Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయని మాజీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను వివరించేందుకు తనకు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. అయితే, భారత్‌లోని మెట్రో నగరాలతో పోలిస్తే అత్యధికంగా మహిళలపై జరుగుతున్న నేరాలు ఢిల్లీలోనే నమోదవుతున్నాయని వెల్లడించారు. ఆ విషయంలో మొదటి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో హత్యలు, దోపిడీలు నానాటికీ పెరిగిపోతున్నాయి.. నేర రాజధానిగా మన దేశం, ఢిల్లీ మారేలా కనబడుతుందన్నారు. స్కూల్స్, ఎయిర్ పోర్ట్స్ కు తరచూ బాంబు బెదిరింపులు రావడంతో పాటు డ్రగ్స్‌ సంబంధిత కేసులు 300 శాతానికి పైగా పెరిగినట్లు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్ నివాసానికి కన్నడ సూపర్ స్టార్

ఇక, ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులతో విద్యార్థుల తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. నిత్యం వారంతా భయంభయంగా జీవితం గడుపుతున్నారు.. పట్టపగలే హత్యలు, కాల్పులు, కిడ్నాప్‌లు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలు క్షీణిస్తుండటం.. ఢిల్లీకి రేప్‌ క్యాపిటల్‌, క్రైం క్యాపిటల్‌ అనే కొత్త పేర్లు వచ్చే ప్రమాదం ఉందన్నారు. రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గురించి మరింత స్పష్టంగా వివరించేందుకు కొంత సమయం ఇవ్వాలని కేజ్రీవాల్ లేఖలో ప్రస్తావించారు.