Site icon NTV Telugu

Governor Ananda Bose: బెంగాల్లో అల్లర్లు.. ముర్షిదాబాద్‌లో గవర్నర్ సీవీ ఆనంద్ క్షేత్ర స్థాయి పర్యటన

Anand Bose

Anand Bose

Governor Ananda Bose: పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. గత వారం రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలతో ఇప్పటి వరకూ పలువురు మృతి చెందారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటి వరకూ 118 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read Also: OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు లిస్ట్ ఇదే

ఇక, హింసాకాండ చెలరేగిన ముర్షిదాబాద్‌లో ఈ రోజు ( ఏప్రిల్ 18న ) నుంచి రెండో రోజుల పాటు పర్యటించబోతున్నట్లు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ పేర్కొన్నారు. ముర్షిదాబాద్‌లో శాంతిని నెలకొల్పేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మమతా బెనర్జీ సర్కార్ లో హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, గవర్నర్ పర్యటనపై సీఎం మమతా బెనర్జీతో సహా రాష్ట్ర నాయకత్వం నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.

Read Also: Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

కాగా, ముర్షిదాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుండటంతో.. కేంద్ర బలగాల మోహరింపును పొడిగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించింది. ఇక, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో హింస పెరిగిందని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను సమర్పించింది. దీంతో పాటు గుర్తు తెలియని గుంపు ప్రాణాంతక ఆయుధాలతో రాష్ట్ర ప్రజలతో పాటు పోలీసులపై దాడి చేశారని అందులో నివేదికలో వెల్లడించింది.

Exit mobile version