Bihar: ఎన్నికల ముందు మరొక హత్య.. ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత
- ఎన్నికల ముందు బీహార్‌లో మరొక హత్య
- ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో హత్యల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న బీజేపీ నేత, వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా ఇంటి దగ్గరే హత్యకు గురయ్యారు. కారులో ఇంటికి చేరిన ఆయన్ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందు తాజాగా గురువారం ఉదయం పట్టపగలు ఆస్పత్రిలో కరుడుగట్టిన ఒక నేరస్థుడ్ని ప్రత్యర్థి గ్యాంగ్ తుపాకులతో కాల్చి చంపింది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితీష్ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత కరవైందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: దాయాది దేశానికి అమెరికా అధ్యక్షుడు.. సెప్టెంబర్‌లో పాక్‌లో పర్యటించనున్న ట్రంప్!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
చందన్ మిశ్రా.. కరుడుగట్టిన నేరస్థుడు. వైద్యం నిమిత్తం పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ప్రత్యర్థి వర్గానికి ఐదుగురు సభ్యులు కలిగిన ముఠా ఆస్పత్రిలోని చందన్ మిశ్రా ఉన్న గదిలోకి ప్రవేశించి తుపాకులతో విరుచుకుపడ్డారు. బుల్లెట్లు దూసుకెళ్లడంతో చందన్ మిశ్రా అక్కడికక్కడే చనిపోయాడు. ఇక తుపాకీ శబ్దాలకు రోగులు, బంధువులు హడలెత్తిపోయారు. అనంతరం దుండుగులు అక్కడ నుంచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయింది.
ఇది కూడా చదవండి: Indore: క్లీన్ సిటీగా ఇండోర్.. వరుసగా 8వ సారి రికార్డ్ సొంతం
బక్సర్ జిల్లా నివాసి అయిన చందన్ మిశ్రా కరుడు గట్టిన నేరస్థుడు. అతడిపై డజన్ల కొద్దీ కేసులున్నాయి. భాగల్పూర్ జైల్లో ఉంటున్నాడు. వైద్య చికిత్స కోసం పెరోల్‌పై పాట్నా ఆస్పత్రికి వచ్చాడు. అయితే ప్రత్యర్థి వర్గం కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాక్సర్ జిల్లా పోలీసుల సాయంతో నిందితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కార్తీకాయ్ శర్మ పేర్కొన్నారు. చందన్ మిశ్రా గాయాలతో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. నేరస్థులను పట్టుకుంటామని ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటన దురదృష్టకరమని… దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. నేరస్థులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.

రాష్ట్రంలో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? అని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతు ఉన్న నేరస్థులు ఐసీయులోకి చొరబడి ఆసుపత్రిలో చేరిన రోగిని కాల్చి చంపారని ఆరోపించారు. 2005 కి ముందు ఇలా జరిగిందా?” అని ఆయన అడిగారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!