Panjab Students Passport: ఈ మధ్య కాలంలో విదేశాల్లో ఉన్నత విద్యను చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు పాస్‌పోర్టు సమస్యలు వస్తున్నాయి. భారతీయ విద్యార్థులకు కొన్ని దేశాలు పాస్‌పోర్టును ఇవ్వడానికి సవాలక్ష షరతులు విధిస్తున్నాయి. ఇప్పటికే ఆష్ట్రేలియా భారత్‌లోని కొన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు పాస్ పోర్టు ఇవ్వడానికి షరతులు విధించింది. అలాగే జపాన్ దేశం కూడా కొన్ని షరతులతో పాస్‌పోర్టులను జారీ చేస్తోంది. ఇపుడు పంజాబ్ విద్యార్థులకు కెనడాలో ఇటువంటి సమస్యనే ఎదురైంది. ఈ నేపథ్యంలో కెనడాలో పంజాబ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న పాస్‌పోర్టు సమస్యలను పరిష్కరించాలని ఆ రాష్ట్ర మంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Read also: Irrigation Day: తెలంగాణలో సాగునీటి దినోత్సవ వేడుకలు.. జిల్లాల వారిగా ఇలా..!
కెనడాలో ఇమ్మిగ్రేషన్ మోసాల్లో ఇరుక్కుని, బహిష్కరణ కేసులను ఎదుర్కొంటున్న 700 మంది భారతీయ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని పంజాబ్ ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 700 మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందిన వారని వారని.. వారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు రాసిన లేఖలో ధాలివాల్ కోరారు. విద్యార్థులను బహిష్కరించరాదని .. వారి వీసాలను పరిగణనలోకి తీసుకుని వర్క్ పర్మిట్‌లు ఇవ్వాలని కోరారు.
Read also: Petrol-Diesel rates: భారత్ లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. లీటరు ఎంతో తెలుసా..?
విద్యార్థులను మోసం చేసిన ట్రావెల్ ఏజెంట్లను శిక్షించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి సహకరించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ధాలివాల్ అభ్యర్థించారు. తాను EAMని కలవడానికి సమయం కూడా కోరానని.. తద్వారా మొత్తం విషయాన్ని వ్యక్తిగతంగా GOI దృష్టికి తీసుకురావచ్చని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో మానవ అక్రమ రవాణా ఘటనలు జరగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. విదేశాలకు వెళ్లే ముందు లేదా తమ పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపే ముందు.. ఆయా కళాశాలల వివరాలను మరియు విద్యార్థులను తీసుకెళ్లే ట్రావెల్ ఏజెంట్ రికార్డును తప్పనిసరిగా తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియాలో మరణశిక్ష విధించబడిన ఇద్దరు పంజాబీ అబ్బాయిల కేసు జూన్ 26 నుండి మళ్లీ ప్రారంభమవుతుందని.. ఈ కేసులో ఇద్దరూ నిర్దోషులుగా విడుదల చేయబడతారని ధాలివాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.