Site icon NTV Telugu

Maha Kumbh Mela 2025: ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు

Mahakumbhmela2025

Mahakumbhmela2025

మహా కుంభమేళాకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తుతున్నారు. ఇప్పటికే 15 కోట్లకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే మహా కుంభమేళాకు వెళ్లే ప్రత్యేక రైలుపై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్యాసింజర్స్ భయాందోళనతో బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: AB De Villiers Re-Entry: అభిమానులకు శుభవార్త.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్‌!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో మహా కుంభమేళ జరుగుతోంది. అయితే యూపీలోని ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు స్పెషల్ ట్రైన్ బయల్దేరింది. హర్పాల్‌పూర్ స్టేషన్‌లో ట్రైన్ వచ్చి ఆగింది. అయితే అప్పటికే రిజర్వేషన్ బోగీలన్నీ ప్రయాణికులతో కిక్కిరిపోయింది. డ్రోర్లు తీసేందుకు కూడా చోటులేదు. అంతగా ప్యాసింజర్స్‌తో ట్రైన్ నిండిపోయింది. అయితే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు మాత్రం ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న వాళ్లంతా ఆగ్రహంతో రగిలిపోయారు. అంతే రాళ్లు తీసుకొచ్చి డోర్ అద్దాలు ధ్వంసం చేసి నానా బీభీత్సం సృష్టించారు. ఈ పరిణామంతో ట్రైన్ లోపల ఉన్న ప్రయాణికులు హడలెత్తిపోయారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను శాంతింపజేశారు. కొన్ని నిమిషాల్లోనే పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రయాణికులంతా సమన్వయం చేసుకుంటూ ప్రయాణాలు సాగించాలని పోలీసులు సూచించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Meerpet Murder Case: కాసేపట్లో మీడియా ముందుకు కిల్లర్ భర్త..

భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పరస్పరం సమన్వయం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులతో సహా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

 

Exit mobile version