Site icon NTV Telugu

Flight Crash: విమానంలో లోపాన్ని ముందే గుర్తించిన యువకుడు.. సంచలన విషయాలు వెల్లడి..!

Akash Vats

Akash Vats

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్‌ ఇండియా విమానంలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు ఆకాశ్ వత్స అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. విమానం కూలడానికి రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ఆ విమానంలో ప్రయాణించినట్లు చెప్పాడు. ఆ విమానంలో తాను ఎదుర్కొన్న సమస్యలను ఆకాశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ‘అహ్మదాబాద్‌ నుంచి బయలుదేరడానికి రెండు గంటల ముందు ఆ విమానంలో నేను ఉన్నా. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు అందులో ప్రయాణించా. ఆ విమానంలో అసాధారణమైన విషయాలను గమనించా’ అని తెలిపాడు. తాజాగా ఈ అంశంపై మరోసారి ఆకాశ్ స్పందించాడు. జరిగిన విషయాన్ని క్లూప్తంగా వివరించాడు.

READ MORE: Pawan Kalyan: లోయలోకి పవన్ కళ్యాణ్ పరుగులు.. అందుకేగా రియల్ హీరో అనేది!

“అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ఆ విమానంలో నేను ప్రయాణించాను. విమానం కూలి పోకంటే ముందకు ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ వచ్చింది. ఈ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో నేను ప్రయాణించాను. విమానం టేకాఫ్ చేయడానికి ముందు గ్రౌండ్‌పై ఉన్నప్పుడు ఏసీలు సరిగ్గా పనిచేయలేదు. గాల్లో ఉన్నపుడు ఫ్లాప్స్ వెనుక భాగం పదే పదే పైకి, కిందకు కదులుతున్నట్లు గమనించాను. విమానంలో ఏసీలు కూడా పని చేయలేదు. విమానానికి గరిష్ట శక్తిని అందించడానికి ఏసీలను ఆఫ్ చేయడం సాధారణమని చాలామంది ఏవియేషన్ నిపుణులు చెప్పారు. అయినా.. ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి నేను ప్రయత్నించాను. కానీ విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉండటంతో సిబ్బంది తొందరలో ఉన్నారు.. ఏసీ ఆన్ చేసిన తర్వాత కూడా దాని ఉష్ణోగ్రత మారుతూనే ఉంది. విమానం దిగి షటిల్ బస్సు ఎక్కినప్పుడు చాలామంది ప్రయాణికులు విమానం ఏసీ కంటే బస్సులోని ఏసీ.. చల్లగా ఉందని భావించారు. ఇదంతా ఎందుకు రికార్డు చేయలేదు అని నన్ను అడుతున్నారు. నేను ట్రావెలర్‌ని కాదు.. సాధారణ ప్రయాణికుడి. ఇప్పుడు విమానం కూలి పోయింది కాబట్టి నేను ఈ ప్రూఫ్‌ను బయటపెట్టాను.” అని ఆకాశ్ వత్స వెల్లడించాడు. ఇప్పుడు ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

READ MORE: Plane Crash: “1206”ను అదృష్ట సంఖ్యగా భావించిన మాజీ సీఎం.. అదే తేదీన మృత్యుఒడికి…

Exit mobile version