Site icon NTV Telugu

Delhi: జమిలిపై నేడు పార్లమెంటరీ కమిటీ సమావేశం

Jpc

Jpc

జమిలిపై మరోసారి కదలిక వచ్చింది. ఇక మంగళవారం ఢిల్లీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది. ఇక త్వరలోనే పార్లమెంటరీ కమిటీ వైబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. క్యూఆర్ కోడ్ సౌకర్యంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెబ్ సైట్ అందుబాటులోకి రానుంది. అన్ని భారతీయ భాషల్లో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుక కమిటీ కసరత్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Ponnala Lakshmaiah: మాజీ మంత్రి ఇంట్లో చోరీ.. నిందితుల అరెస్ట్

నేటి జేపీసీ సమావేశంలో జస్టిస్ హేమంత్ గుప్తా (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), జస్టిస్ ఎస్.ఎన్. ఝా (జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి), డా. జస్టిస్ బి.ఎస్. చౌహాన్ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, 21వ లా కమిషన్ చైర్మన్), డా. అభిషేక్ మను సింఘ్వి (రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది) సమావేశం కానున్నారు.

ఇది కూడా చదవండి: Amardeep : బిగ్ బాస్ అమర్‌దీప్ హీరోగా కొత్త సినిమా

మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. దీంతో మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇది చట్టం కాబోతుంది. ఇందుకోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితే.. ఇకపై ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: RashaThadani : రవీనా టండన్ కూతురు ఫొటోస్ తో రచ్చలేపుతుందిగా

Exit mobile version