పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఆందోళనలు, నిరసనలతోనే సమాప్తమయ్యాయి. గత వర్షాకాల సమావేశాల మాదిరిగా ‘సర్’పైనే రాద్ధాంతం నడిచింది. ఈ సమావేశాల్లో మాత్రం ‘SIR’పై చర్చ చేపట్టారు. అయితే ఈ సెషన్స్‌లో కాలుష్యంపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. కానీ ఎలాంటి చర్చ లేకుండా ముగిశాయి.
తాజా సమావేశాలు దాదాపు 19 రోజులు నడిచాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు.. శుక్రవారం (డిసెంబర్ 19)తో ముగిశాయి. కానీ దేశ రాజధానిని పట్టిపీడిస్తు్న్న కాలుష్యంపై మాత్రం చర్చ జరగకుండానే సమావేశాలు ముగియడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ వాసులు ఎంత విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోలేదు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాల్లోనే ‘ఢిల్లీ కాలుష్యం’పై చర్చకు డిమాండ్ చేస్తామని విపక్ష పార్టీలు అన్నాయి. తీరా చూస్తే.. అలాంటి ఊసే లేకుండా సమావేశాలు ముగిసిపోవడం చర్చనీయాంశం అవుతోంది. శుక్రవరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేశారు. పలు బిల్లులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ముఖ్యంగా ‘జీ-రామ్-జీ’ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాల ఆందోళనలు మధ్యే బిల్లు ఆమోదం పొందింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారు.
