Parliament Sessions : పునరుత్పాదక ఇంధన రంగంలో వేలాది ఉద్యోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Budget Sessions 2nd Phase Tuesday Updates.
రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లను నెలకొల్పడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాల కల్పన ఏ మేరకు జరిగిందని ప్రశ్నించారు. దీనిపై పునరుత్పాదక ఇంధన రంగంలో దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగావకాశలు కల్పిస్తున్నట్లు ఇంధన మంత్రిత్వశాఖ సహాయ మంత్రి భగవంత్ కూబా ప్రకటించారు. సౌర ఇంధన విభాగంలో మూడు మార్గాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మానవ వనరుల శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా 62,340 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. 100 అత్యున్నత విద్యా సంస్థలలో ఎంటెక్, పీహెచ్డీ అభ్యర్ధుల కోసం జాతీయ పునరుత్పాదక ఇంధన ఫెలోషిప్ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
Also Read
- Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ కుర్చీల కొట్లాట.. త్వరలోనే హైకమాండ్ కీలక నిర్ణయం!
- EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
“సూర్య మిత్ర” పథకం కింద 50,806 మందికి శిక్షణ ఇవ్వగా అందులో 53 శాతం మందికి ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన తెలిపారు. “వరుణ్ మిత్ర” పథకం కింద సోలార్ వాటర్ పంప్ టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. “వాయు మిత్ర” పథకం కింద పవన విద్యుచ్ఛక్తిలో టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. సోలార్ ఇంధన రంగంలో ఇప్పటికి దేశంలో 11,500 మెగావాట్ల స్థాపిత సామర్ధ్యానికి చేరుకోగా ప్రతి మెగా వాట్‌కు 2.6 మంది ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పారు. మొత్తంమీద 29,900 మందికి సోలార్ విద్యుత్ ఉత్పాదన రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Virat Kohli Record: అరుదైన ఘనతకు చేరువలో విరాట్ కోహ్లీ.. నంబర్-1 ప్లేయర్‌గా చరిత్ర!
-
Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ కుర్చీల కొట్లాట.. త్వరలోనే హైకమాండ్ కీలక నిర్ణయం!
-
EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
-
Nirmala Sitharaman: దేశానికి కీలకమైన 3Fలపై.. భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
-
Bhagyashree: “వయసు కాదు.. పాత్ర గొప్పది”.. రితేష్‌కు తల్లిగా నటించడంపై భాగ్యశ్రీ క్లారిటీ
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!