NTV Telugu Site icon

Union Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్‌లో ఈ రాష్ట్రాలకు తాయిలాలు ఉండే ఛాన్స్!

Nirmalasitharaman

Nirmalasitharaman

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఇక బడ్జెట్‌పై అన్ని రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఆయా రాష్ట్రాలు నిర్మలమ్మ బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నాయి. అలాగే ధరల తగ్గింపుపై ఏమైనా శుభవార్త అందుతుందేమోనని సామాన్య ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇలా అన్ని రకాల ప్రజలు బడ్జెట్ కోసం నిరీక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Monalisa Kumbh: బాలీవుడ్ సినిమా సైన్ చేసిన తేనెకళ్ల మోనాలిసా

ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్రంలో బీహార్‌కు చెందిన జేడీయూ, ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీల మద్దతుతో మోడీ ప్రభుత్వం నడుస్తోంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రెండు రాష్ట్రాలు… నిర్మలమ్మ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. పైగా ఈ ఏడాది అక్టోబర్‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎన్డీఏ కూటమికి చాలా కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో బీహార్‌పై వరాల జల్లు కురిపించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్‌కు అత్యధికంగా తాయిలాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోసారి బీహార్‌లో ఎన్డీఏ కూటమి పాగా వేయాలని చూస్తోంది. దీంతో బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత బీహార్‌కు ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అలాగే మరో మిత్రపక్షం ఏపీలో ఉన్న టీడీపీకి కూడా తాయిలాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ, బీహార్‌కు నిర్మలమ్మ వరాలు కురిపించే ఛాన్సుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: ఇలాంటి గర్ల్‌ఫ్రెండ్ ఉండాలి.. ఆమె ఐడియాతో “కుంభమేళా”లో డబ్బులు సంపాదిస్తున్న యువకుడు..

ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతున్నాయి. మొదటి సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతుండగా.. రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో దాదాపు 16 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంతో సహా 16 బిల్లులు బడ్జెట్ సెషన్‌లో ప్రవేశపెట్టనన్నారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ఎనిమిదో సారి శనివారం సమర్పించనున్నారు.

అయితే ఈ సమావేశాలు కూడా వాడీవేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత శీతాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా సాగాయి. అదానీ లంచాల వ్యవహారంతో ఉభయ సభలు అట్టుడికాయి. ఈ బడ్జెట్ సమావేశాలు కూడా అదే మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Gopisundar: గోపీసుందర్ ఇంట తీవ్ర విషాదం