NTV Telugu Site icon

Pakistan: పీఓకేలో ఉగ్రవాదులకు పాక్ సాయం.. చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ

Terrorists

Terrorists

Pakistan: దాయది దేశం పాకిస్తాన్, భారతదేశంపై ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉంటుంది. ఇటీవల కాలంలో భారత్ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా గ్లోబల్ పవర్ గా భారత్ ఎదుగుతుంటే.. డాలర్లను అడుక్కునే స్థాయికి పాకిస్తాన్ దిగజారింది. దీంతో భారత సరిహద్దుల్లో నిత్యం అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. తాజాగా జీ20 సదస్సు విజయవంతం అవ్వడం కూడా అక్కడి సైన్యానికి, ఆ దేశ ప్రభుత్వాన్నికి అసూయ కలిగిస్తోంది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. పాకిస్తాన్ సైన్యం, ఆ దేశ ఇంటెలిజెన్స్ ఎజెన్సీ ఐఎస్ఐ ఉగ్రవాదులకు శిక్షణ, అత్యాధునిక ఆయుధాలను అందిస్తున్నాయి. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులకు చైనాలో తయారైన ఆధునిక ఆయుధాలను పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) అందజేస్తోందని భారత నిఘా సంస్థల అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు అందిస్తున్న ఆయుధాలల్లో పిస్టల్స్, గ్రెనేడ్స్, నైట్ విజన్ పరికరాలు ఉన్నాయని, వీటిని చైనా డ్రోన్ల ద్వారా చేరవేస్తున్నారని తెలిపింది.

Read Also: Miss Universe: మిస్ యూనివర్స్ కావాలనుకునే మోడళ్లకు శుభవార్త..

అంతే కాకుండా ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు డిజిటల్ మ్యాప్ షీట్లు, నావిగేషన్ పరికరాలను అందచేస్తున్నట్లు వారు తెలిపారు. భారతీయ ఏజెన్సీలు ఉగ్రవాదుల సంభాషణల్ని డీకోడ్ చేయకుండా పీఓకేలోని ఉగ్రవాదులకు అత్యంత ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గురువారం కెన్యా నైరోబి నుంచి న్యూఢిల్లీకి వచ్చిన కీలక ఐసిస్ ఉగ్రవాదిని జాతీయదర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పట్టుకుంది. అరాఫత్ అలీ అనే ఉగ్రవాది 2020 నుంచి పరారీలో ఉన్నాడు. భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు ఐసిస్ మాడ్యుళ్లను ఏర్పాటు చేసే కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది.