Site icon NTV Telugu

Rajnath Singh: చైనా ముందే పాకిస్తాన్ను ఏకిపారేసిన రాజ్నాథ్ సింగ్

Rajnath

Rajnath

Rajnath Singh: చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి భారత్ తరపున కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు. అయితే, గల్వాన్‌ లోయలో జరిగిన ఘటన తర్వాత ఆయన బీజింగ్ లో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా, భారతదేశ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్‌కు సమావేశ వేదిక దగ్గర డ్రాగన్ కంట్రీ రక్షణ మంత్రి అడ్మిరల్‌ డాంగ్‌ జున్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇతర నాయకులతో కలిసి రాజ్ నాథ్ గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ గ్రూప్ ఫోటో సెషన్ సమయంలో పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కూడా అక్కడే ఉన్నారు.

Read Also: Storyboard : నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం..? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయి..?

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. చైనా ముందే పాకిస్తాన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది.. దాన్ని అరికట్టడానికి సరిహద్దు దాటిన టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయడానికి మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. తమై తరుచూ దాడులకు పాల్పడుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడనికి ఏమాత్రం వెనుకాడము అని తేల్చి చెప్పారు. మన యువతలో రాడికలైజేషన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మనం కూడా చురుకైన చర్యలు తీసుకోవాలి అని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లించారు.

Read Also: Vimal Bags : విదేశీయులకు “విమల్” మోజు.. లగ్జరీ బ్రాండ్లకు చెల్లుచీటి..?

ఇక, షాంఘై సహకార సంస్థలోని RATS యంత్రాంగం ఈ విషయంలో అద్భుతమైన పాత్ర పోషించింది అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అలాగే, భారతదేశం అధ్యక్షత వహించిన సమయంలో ‘ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదానికి దారితీసే రాడికలైజేషన్‌ను ఎదుర్కోవడంపై ఎస్‌సీఓ దేశాధినేతల మండలి సంయుక్త ప్రకటన విడుదల చేయడం మన ఉమ్మడి నిబద్ధతకు ప్రతీక అన్నారు. మరోవైపు ఈ సమావేశం తర్వాత బీజింగ్ రక్షణ మంత్రి డాంగ్ జున్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని రాజ్ నాథ్ సింగ్ యోచిస్తున్నారు. చైనా-భారత్ సైనిక హాట్‌లైన్‌ను తిరిగి ప్రారంభించడంపై దృష్టి పెట్టారు. దీంతో పాటు అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడటానికి భారత్ తన వంతు ప్రయత్నం చేస్తుంది. అయితే, ఈ రోజు చైనా అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో భారత్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు.

Exit mobile version