Site icon NTV Telugu

Pakistan PM: భారత్ మెరుపు దాడులు.. బిత్తరపోయిన పాక్‌ ప్రధాని

Shahabaz Sharaf

Shahabaz Sharaf

Pakistan PM: భారత్‌ దాడులను పాకిస్తాన్ సైన్యం ధ్రువీకరించింది. పాక్‌ డీజీ ఐఎస్‌పీఆర్‌ లెప్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ రియాక్ట్ అయ్యారు. పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ ఏరియాల్లో ఈ దాడులు కొనసాగినట్లు పేర్కొనింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా, 12 మంది తీవ్రంగా గాయపడినట్లు పాక్‌ ఆర్మీ తెలిపింది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే, భారత్‌ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని పాక్ డీజీ ఐఎస్‌పీఆర్‌ లెప్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ అన్నారు.

Read Also: Kishan Reddy: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో తెలంగాణకు మేలు..

అయితే, ఇండియన్‌ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ రియాక్ట్ అయ్యారు. తమ దేశంలోని 5 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలకు పాకిస్థాన్‌ కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని వెల్లడించారు. ఈ సమయంలో పాక్‌ సైన్యం వెంట దేశ మొత్తం నిలబడి ఉందన్నారు. భారత్ ను ఎలా ఎదుర్కోవాలో పాక్ ఆర్మీకి తెలుసు అన్నారు. ప్రత్యర్థి ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ మా దేశంపై నెరవేరనీయం అని ఎక్స్‌లో షెహబాజ్ షరీఫ్ పోస్టు చేశారు.

Read Also: Kethika Sharma : వారిద్దరే నా ఫేవరెట్ హీరోయిన్లు..

ఇక, ఈ దాడులను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యుద్ధ చర్యలగా పేర్కొన్నారు. పాక్‌ ప్రధాని ప్రకటన తర్వాత భారత్- పాక్ సరిహద్దులోని పూంఛ్‌, రాజౌరి సెక్టార్లలో పాక్‌ సైన్యం కాల్పులు స్టార్ట్ చేసింది. దీనికి భారత్‌ సైతం కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఎల్‌వోసీ వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావారణం కొనసాగుతుంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్‌ లష్కరే తొయిబాకు హెడ్‌ క్వార్టర్స్‌గా ఉందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇక, పంజాబ్‌ ప్రావిన్స్‌లోని బహవల్పూర్‌లో మసూద్‌ అజార్‌ నేతృత్వంలోని జైష్‌ -ఎ- మహ్మద్‌ స్థావరం ఉందని తేల్చింది.

Exit mobile version