Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- జైషే చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంచిన పాకిస్తాన్..
- FATF సమావేశానికి ముందు కీలక చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన మసూద్ అజర్‌పై దాయాది దేశం పాకిస్తాన్ రివార్డును పెంచింది. అతడి అరెస్ట్‌కు దారితీసే సమాచారాన్ని ఇస్తే, ఇచ్చిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో సుమారు రూ.24.09 లక్షలు) చెల్లిస్తామని ప్రకటించింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) మసూద్ అజర్‌ను తమ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా జాబితా చేసింది.
అయితే, ఈ పరిణామాలు అక్టోబర్ 26 నుంచి 30 వరకు పారిస్‌లో జరగబోతున్న ‘‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF)’’ ప్లీనరీకి ముందు జరిగింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, మనీలాండరింగ్‌కు పాల్పడే దేశాలపై FATF ఆంక్షలు విధిస్తుంది. ఈ సమయంలోనే పాకిస్తాన్ కీలక చర్య తీసుకుంది.
Also Read
- Sonia Gandhi: ‘ఇది పొలిటికల్ బుక్ కాదు’.. తన కొత్త పుస్తకం ‘Belonging’పై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
- Delhi Air Pollution After Diwali: ఢిల్లీలో మళ్లీ తీవ్ర వాయు కాలుష్యం.. AQI 366కు చేరిక, పొగమంచుతో కప్పుకున్న నగరం
- Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
- Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
లేడూ అంటూనే బౌంటీ..
మసూద్ అజర్ తమ దేశంలో లేడంటూనే పాకిస్తాన్ బౌటీని పెంచింది. అతను ఆఫ్ఘనిస్తాన్ పారిపోయాడంటూ గత కొన్నేళ్లుగా కథలు చెబుతోంది. మరోవైపు, FIA విడుదల చేసిన ‘‘2026 రెడ్ బుక్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ హై-ప్రొఫైల్ టెర్రరిస్ట్స్’’లో అజర్ పేరు ఉంది.
జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడైన అజర్, భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. 2001 పార్లమెంట్‌పై దాడి, 2008 ముంబై ఉగ్రదాడి, 2016 పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై దాడి, 2019 పుల్వామా అటాక్‌లో జైషే మహ్మద్ ప్రమేయం ఉంది. గతేడాది ఆపరేషన్ సిందూర్ లో భారత్ జైషే హెడ్ క్వార్టర్ ఉన్న పాకిస్తాన్‌లోని బహవల్పూర్పై దాడి చేసింది.
IC-814 హైజాక్ తర్వాత విడుదల..
మసూద్ అజర్ ఒకప్పుడు భారత కస్టడీలోనే ఉన్నాడు. 1999 ఇండియన్ ఎయిర్ లైన్స్ C-814 విమానం ఖాట్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న క్రమంలో హైజాక్‌కు గురైంది. ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేసి అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు కరడుగట్టిన ఉగ్రవాదుల్ని భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. ఇందులో మసూద్ అజర్ కూడా ఉన్నాడు.
ఆపరేషన్ సిందూర్‌లో కుటుంబం ఖతం..
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ లోని టెర్రర్ స్థావరాలపై దాడులు చేసింది. పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసింది. ఆ సమయంలో మసూద్ అజర్ ప్రాణాలతో బయటపడినప్పటికీ, అతడి కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహిత సహాయకులు మరణించినట్లు సమాచారం. మృతుల్లో అజర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, కుటుంబంలోని ఐదుగురు పిల్లలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Ramayana Record: ‘రామాయణ’ రికార్డుల జాతర.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ను దాటేసి టాప్‌లోకి!
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Ramayana Box Office: ‘ఆదిపురుష్’ రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
-
Naga Chaitanya: నాగ చైతన్య ముందు పెద్ద టార్గెట్టే.. 300 కోట్లను దుల్లగొడితేనే..!
-
Gold Price Today: బంగారం ధరల మోత.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ట్రెండింగ్
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..