Site icon NTV Telugu

Hafiz Saeed: మోస్ట్ వాంటెడ్ హఫీస్ సయీద్‌కి పాక్ భారీ భద్రత.. లాహోర్‌లో నిర్భయంగా..

Hafiz Saeed

Hafiz Saeed

Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకస్తాన్ భారీ ఎత్తున భద్రత కల్పిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే ప్రాక్సీ అయిన ‘‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులే. పహల్గామ్ దాడి తర్వాత భారత టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీస్ సయీద్ ఉన్నాడని తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ అతడికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు తెలుస్తోంది.

Read Also: Pakistan: ‘‘అయోధ్యలో బాబ్రీ మసీదు, అజాన్ పఠించేది పాక్ ఆర్మీ చీఫ్, సిక్కులు యుద్ధం చేయొద్దు’’..

లాహోర్‌లో నిర్భయంగా..

పాకిస్తాన్ పంజాబ్ రాజధాని లాహోర్‌లోని జన సాంద్రత ఎక్కువగా ఉండే ఒక ఏరియాలో హఫీజ్ సయీద్ నివసిస్తున్నాడు. సాధారణంగా, ఉగ్రవాదులు మారుమూల ప్రాంతాల్లో ఉంటారు. అయితే, హఫీజ్ సయీద్ మాత్రం బిజీ ఏరియాలో నివసిస్తున్నాడు. అతడి నివాసంలో మసీదు, మదర్సా ఉన్నాయి. అతడి కోసం ఒక ప్రైవేట్ పార్కు కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ ప్రభుత్వ భద్రతలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. హఫీస్ సయీద్ ఉంటున్న భవనం కింద బంకర్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లు హఫీజ్ సయీద్ జైలు ఉన్నాడని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. కానీ, అతను మాత్రం దర్జాగా అతడి నివాసం నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. గత నెలలో, హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబూ ఖతల్ హత్య తర్వాత పాకిస్తాన్ హఫీజ్ సయీద్‌కి భద్రతను కట్టుదిట్టం చేసింది. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఈ భద్రతను మరింత పెంచినట్లు తెలుస్తోంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అతడి నివాసాన్నే సబ్ జైలుగా మార్చింది. సయీద్ బాహ్య ప్రాంతాలకు వెళ్లకుండా ఐఎస్ఐ అతడిని నిరోధిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

Exit mobile version