Site icon NTV Telugu

IND vs PAK: భారత్ అభ్యంతరం.. పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ..

Ind Vs Pak

Ind Vs Pak

IND vs PAK: పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు నిధులను విడుదల చేయడంపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ.. పాక్‌కు గత నెలలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,500 కోట్లు) ప్యాకేజీని రిలీజ్ చేసింది. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాదం కోసం మళ్లీస్తుందని ఇండియా వాదిస్తున్నప్పటికీ తాజాగా, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) కూడా పాక్‌కు 800 మిలియన్ల డాలర్ల ప్యాకేజీని ఆమోదించింది.

Read Also: Vaibhav Suryavanshi: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. కారు గెలిచాడు కానీ.. మరో నాలుగేళ్లు..?

ఇక, ఆసియా అభివృద్ధి బ్యాంకు పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం అందించడంపై భారతదేశం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. 2018లో పాకిస్తాన్ జీడీపీలో 13 శాతంగా ఉన్న పన్ను ఆదాయం 2023లో కేవలం 9.2 శాతానికి గణనీయంగా తగ్గడంతో పాటు దాని రక్షణ వ్యయం పెరగడంతో పాక్ ఆర్థిక దుర్బలత్వానికి పాల్పడుతుందని భారత్ ఆరోపించింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఇతర అంతర్జాతీయ రుణదాతల నుంచి వచ్చే నిధులు అభివృద్ధికి బదులుగా సైనిక ఖర్చులకు పాక్ మళ్లిస్తుందని ఇండియా పేర్కొంది.

Exit mobile version