Site icon NTV Telugu

Pakistan: “ఢిల్లీ ఘటన సిలిండర్ పేలుడు మాత్రమే”.. పాక్ రక్షణ మంత్రి మాటల్లో భయం..

Pakistan

Pakistan

Pakistan: భారతదేశంలో ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగిన, దాని మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయి. అయితే, ఈ నిజాన్ని ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఒప్పుకోదు. తమ ప్రమేయం లేదని చెబుతుంటుంది. ఈసారి కూడా అదే ప్రయత్నం చేసింది. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్‌ను తక్కువ చేసేలా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ ఉగ్రదాడి గురించి స్పందిస్తూ.. ‘‘గ్యాస్ సిలిండర్ పేలుడు’’గా ఆసిఫ్ అభివర్ణించారు. భారత్ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుకుంటోందని ఆరోపించారు.

Read Also: Donald Trump: ‘‘నీకు ఎంత మంది భార్యలు’’.. దేశాధ్యక్షుడిని అడిగిన ట్రంప్..

పాకిస్తాన్‌లోని ఒక టీవీ షో సందర్భంగా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కార్ బాంబ్ దాడికి ఉగ్రవాద దాడికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని భద్రతా సంస్థలు నిర్ధారించాయి. దీనిపై ఆసిఫ్ మాట్లాడుతూ.. ‘‘ నిన్నటి వరకు ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటన. కానీ ఇప్పుడు వారు దానిని విదేశీ కుట్రగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు. ‘‘రాబోయే కొన్ని గంటల్లో లేదా రేపు, భారతదేశం మాపై దురాక్రమణ చేసినా, మాపై ఆరోపణలు చేసినా నేను ఆశ్చర్యపోను’’ అని అన్నారు. పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలతో ఆయనలోని భయం స్పష్టంగా తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో పుల్వామా, ఉరి, ముంబై దాడులు జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ ఇలాగే తమ ప్రమేయం లేదని చెప్పుకుంది. ఢిల్లీ దాడి ఉగ్రవాద ఘటనే అని కేంద్రం స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మాడ్యుల్‌తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది.

Exit mobile version