Site icon NTV Telugu

India Pakistan: పాక్ ఆర్మీ చేతిలో రాహుల్ గాంధీ, సత్యపాల్ మాలిక్ వీడియో..

Satypal Malik

Satypal Malik

India Pakistan: పాకిస్తాన్ భారతదేశంలో చేస్తు్న్న ఉగ్రవాద దాడుల్ని కవర్ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వీడియోలను వాడుతోంది. ఇటీవల, పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్నారు. ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కి చెందిన వారని స్పష్టమైంది. అయితే, పాకిస్తాన్ మాత్రం భారత్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపిస్తోంది.

దీనికి ఆధారంగా, 2019లో జరిగి పుల్వామా దాడికి సంబంధించి రాహుల్ గాంధీ, సత్యపాల్ మాలిక్ మాట్లాడిన వీడియోని పాకిస్తాన్ ఆర్మీ కోట్ చేస్తోంది. విదేశీ మీడియాతో ఈ వీడియోని పంచుకుంది. పాక్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్‌పీఆర్ ఈ వీడియోని హైలెట్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయాల కోసం అమాయకులైన కాశ్మీరీలను, ముస్లింలను చంపుతోందని, పాకిస్తాన్‌పై ఆరోపిస్తోందని ఐఎస్‌పీఆర్ డీజీ అహ్మద్ షరీఫ్ చెబుతూ, విదేశీ మీడియాకు ఈ వీడియోని చూపించారు. ఇందులో పాకిస్తాన్ ప్రమేయం ఉందని చెప్పి, బాలాకోట్‌ ఎయిర్ స్ట్రైక్స్‌‌ని ఎన్నికల కోసం కేంద్రం వాడుకుందని సత్యపాల్ మాలిక్ అనడాన్ని పాక్ ఆర్మీ హైలెట్ చేసింది.

పుల్వామా అటాక్:

ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై 78 బస్సుల్లో దాదాపు 2,500 మంది జవాన్లతో కూడిన CRPF కాన్వాయ్ ప్రయాణిస్తోంది. కాన్వాయ్ పుల్వామా చేరుకున్న కొద్దిసేపటికే బాంబులతో నిండిన ఒక కారు కాన్వాన్‌ని ఢీకొట్టింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులు చేసింది.

Exit mobile version